ఆదిత్య 369 స్పెషల్.. ఆ రోజుల్లో బడ్జెట్, బిజినెస్ ఎంత.. బాలయ్య రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్ని సినిమాలు అయినా చేసి ఉండొచ్చు కానీ.. ఆదిత్య 369 మాత్రం ఇప్పటికే అలాగే గుర్తుండిపోయే సినిమా.

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్ని సినిమాలు అయినా చేసి ఉండొచ్చు కానీ.. ఆదిత్య 369 మాత్రం ఇప్పటికే అలాగే గుర్తుండిపోయే సినిమా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఆదిత్య 369. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కేవలం కమర్షియల్ గానే కాదు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా. ఏప్రిల్ 4న మరోసారి ఆదిత్య 369 సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటున్నారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజుల్లో ఆదిత్య 369 కోసం వాళ్ళు పెట్టిన బడ్జెట్, బిజినెస్.. బాలయ్య ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఇలా ప్రతి ఒక్కటి చెప్పాడు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. 1991 ఆగస్టు 18 ఈ సినిమా విడుదలైంది. 35 సంవత్సరాల కిందే ఈ సినిమాను దాదాపు ఏడాది పాటు తెరకెక్కించారు.
ఆ రోజుల్లో ఏ పెద్ద సినిమా అయినా కేవలం 5 నెలల్లోనే పూర్తి చేసేవాళ్లు.. అలాంటి రోజుల్లోనే ఏడాది పాటు ఈ సినిమాను తెరకెక్కిస్తూనే ఉన్నామని చెప్పాడు నిర్మాత కృష్ణప్రసాద్. అంతేకాదు అప్పట్లో ఆదిత్య 369 కోసం బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్లు తెలిపాడాయన. ఏడాది పాటు షూట్ చేసాం కాబట్టి బడ్జెట్ కూడా ముందు అనుకున్న దాని కంటే భారీగానే అయిందని.. తన కెరీర్‌లో ఓ సినిమా బడ్జెట్ వేసుకున్న తర్వాత తప్పింది కేవలం ఆదిత్య 369కే అని చెప్పాడు శివలెంక. అంతేకాదు.. ఈ సినిమా మొత్తం వర్కింగ్ డేస్ 110 రోజులు అయితే.. అందులో బాలయ్య 90 రోజులు ఇచ్చాడని తెలిపాడు నిర్మాత శివలెంక. లారీ డ్రైవర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత తన సినిమా వచ్చిందని.. అందుకే బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగిందని తెలిపాడు ఈ నిర్మాత. 1.40 కోట్ల రేంజ్‌లో అప్పట్లోనే ఆదిత్య 369 బిజినెస్ చేసానని.. కానీ ఖర్చు అయింది మాత్రం కోటిన్నర అని చెప్పాడీయన.
12 లక్షల డెఫిషిట్‌లో ఈ సినిమాను విడుదల చేసినా.. తనకు తర్వాత చాలా లాభాలు తీసుకొచ్చిన సినిమా ఆదిత్య 369 అని.. ఈ విషయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం తనకు చాలా హెల్ప్ చేసారన్నాడు శివలెంక కృష్ణప్రసాద్. అంతేకాదు అప్పట్లో ఆదిత్య 369 కోసం బాలయ్యకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిపారు మేకర్స్. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పటికే ముద్దుల వేనల్లుడు, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్ లాంటి సినిమాలతో బాలయ్య మంచి ఊపు మీదున్నాడు. అయితే రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య తనను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదని.. కుదిర్తేనే ఇవ్వండి అని చెప్పాడన్నాడు కృష్ణప్రసాద్. విడుదలైన తర్వాత ఆదిత్య 369 ఎక్కడా ఆగలేదని.. తెలుగుతో పాటు మిగిలిన భాషల వాళ్లు కూడా ఈ సినిమాను చూసి అద్భుతం అని పొగాడారన్నాడు శివలెంక. అలాంటి సినిమా మళ్లీ ఇప్పుడు 4kలో విడుదలవుతుంది. మరి ఈ జనరేషన్ ఆడియన్స్ ఏం చేస్తారో చూడాలిక.