అడవి శేష్ మరో కల్నల్ బయోపిక్, తెలుగు వీర జవాన్ మూవీ ప్లాన్
ఇండియన్ సినిమాలో ఆర్మీ అధికారులు జీవితాల ఆధారంగా వచ్చిన బయోపిక్ సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఈ సినిమాలను చేసి మంచి ఇమేజ్ పొందుతున్నారు. బాలీవుడ్ లో వచ్చిన షేర్ షా సినిమా సూపర్ హిట్ అయింది.
ఇండియన్ సినిమాలో ఆర్మీ అధికారులు జీవితాల ఆధారంగా వచ్చిన బయోపిక్ సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఈ సినిమాలను చేసి మంచి ఇమేజ్ పొందుతున్నారు. బాలీవుడ్ లో వచ్చిన షేర్ షా సినిమా సూపర్ హిట్ అయింది. కార్గిల్ వార్ హీరో విక్రం బాత్రా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమాకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. మన తెలుగులో కూడా ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడుకి చెందిన ఆర్మీ అధికారి మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తర్కెక్కిన అమరన్ అనే సినిమాకు కూడా చాలా మంచి స్పందన వచ్చింది.
ఆ సినిమాలో హీరోగా నటించిన శివ కార్తికేయన్ ఒకరకంగా ఆ పాత్రలో జీవించాడని చెప్పాలి. అలాగే ఇందూ రెబెకా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవి కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ 300 కోట్ల కలెక్షన్ క్లబ్ లో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు మన తెలుగులో కూడా ఒక ఆర్మీ అధికారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ అధికారి, కల్నల్ దివంగత బిక్కుమళ్ళ సంతోష్ జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నారు.
ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా మేజర్ అనే సినిమాను తెరకెక్కించిన అడవి శేషు ఇప్పుడు సంతోష్ బయోపిక్ ను కూడా తర్కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మేజర్ సినిమాతో అడవి శేష్ కు చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక యువ దర్శకుడు కథను సిద్ధం చేస్తున్నాడట. వచ్చేయడాది వేసవిలో ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. షూటింగ్ ఎక్కువగా… లడఖ్ లో ఉండటంతో చలికాలం తగ్గిన తర్వాత అక్కడ షూట్ చేయనున్నారు.
చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. చైనా తో సరిహద్దు గొడవలు నేపథ్యంలో గాల్వాన్ లోయలో ఓ ఘర్షణ రేగగా దాదాపు 20 మంది భారత సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు, అప్పుడు సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. అతని భార్యకు ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇప్పుడు అతని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు అడవి శేషు. దీనికి సంబంధించి కథ కూడా ఇప్పటికే రెడీగా ఉందని అయితే కథలో కొన్ని మార్పులు సంతోష్… కుటుంబ సభ్యులు చెప్పడంతో అడవి శేషు మారుస్తున్నట్టుగా సమాచారం. 2026 దసరా నాటికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.