Adivi Sesh : నా రూటే సపరేటు అంటున్న అడవి శేష్.. ప్రేమ కథలో మరో సినిమా
అడివి శేష్..'మేజర్', 'హిట్ 2' సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఒకటి గూఢచారి2 కాగా.. మరోక్కటి లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

Adju Sesh called Na Rute Saparaetu another movie in love story
హీరోలకి సక్సెస్ అనేది బూస్ట్ లాంటి. ఒక్కసారి హిట్ ట్రాక్ ఎక్కితే వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ విషయంతో తన స్ట్రాటజీ వేరంటున్నాడు అడివిశేష్. హిట్2 తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తను ఇప్పుడు ఒకేసారి రెండు డిఫరెంట్ మూవీస్ ని స్టార్ట్ చేయబోతున్నాడు.
అడివి శేష్..’మేజర్’, ‘హిట్ 2’ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఒకటి గూఢచారి2 కాగా.. మరోక్కటి లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
గూడచారి సీక్వెల్ పై వర్క్ చేసిన యూనిట్ ఎట్టకేలకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసింది. ఆర్టిస్టులతో పాటు షెడ్యూల్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తోంది. మరోవైపు అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేయడానికి కూడా అడివి శేష్ రెడీ అవుతున్నాడు. ఒక కొత్త దర్శకుడు చెప్పిన ప్రేమ కథ శేష్ కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ని కూడా ప్యార్లల్ గా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది షార్ట్ గ్యాప్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి స్పై యాక్షన్ థ్రిల్లర్స్ తో ఆకటుకున్న శేష్ ఈసారి లవ్ జోనర్ తో ఎలాంటి థ్రిల్ ని అందిస్తాడో చూడాలి.