రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు అడ్వెంచర్లు.. జక్కన్న మ్యూజిక్ స్టార్ట్

రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ ఉంటుంది. షూట్ అయిన తర్వాత పదేపదే సినిమాను తనకు నచ్చలేదని రీ షూట్ చేస్తూ ఉంటాడు రాజమౌళి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 11:34 AMLast Updated on: Feb 18, 2025 | 11:34 AM

Adventures Of Mahesh Babu In Ramoji Film City

రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ ఉంటుంది. షూట్ అయిన తర్వాత పదేపదే సినిమాను తనకు నచ్చలేదని రీ షూట్ చేస్తూ ఉంటాడు రాజమౌళి. బాహుబలి సినిమా విషయంలో ఇదే కామెంట్స్ వచ్చాయి. త్రిబుల్ ఆర్ సినిమా సమయంలో కూడా ఇవే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం రాజమౌళి ఆ పద్ధతిని పక్కన పెట్టాడు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని వర్కౌట్ స్టార్ట్ చేశాడు.

2026 సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అందుకే సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడ లేట్ చేయడం లేదు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ ను కూడా విదేశాల్లో ఫైనల్ చేసేసాడు. బ్రెజిల్ కూడా వెళ్లి అక్కడ కూడా షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాను అంచనాలకు మించి ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. సినిమాలో విలన్ గా ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేయడం కచ్చితంగా సెన్సేషన్ అనే చెప్పాలి. దాదాపు మూడేళ్ల పాటు ఆమె సినిమా కోసం టైం కేటాయించే ఛాన్స్ ఉంది.

రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాను ఫస్ట్ పార్ట్ 2026 సంక్రాంతికి, సెకండ్ పార్ట్ 2028 సంక్రాంతికి రిలీజ్ చేయాలని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో హాలీవుడ్ లేదా బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే రీసెంట్ గా హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు తిరిగి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక భారీ సెట్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇక్కడ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్రెజిల్ లేదా కెన్యా వెళ్లే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా ఉంది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉందని రీసెంట్ గా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కనీసం ప్రియాంక చోప్రా విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు జక్కన్న. గతంలో తన సినిమాల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండేవాడు. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడనే ఒక అప్డేట్ తప్ప మిగిలిన ఏ అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. షూటింగ్ జరుగుతుందని అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. కానీ సినిమాలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనేది మాత్రం చెప్పడం లేదు.