17 ఏళ్ళ తర్వాత రెబల్ స్టార్ తో.. ఏం ప్లాన్ చేసావ్ మారుతీ…?
టాలీవుడ్ కు కూడా స్పెషల్ సాంగ్స్ పిచ్చి పట్టింది. టాలీవుడ్ జనాలు కూడా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఐటెం సాంగ్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తే..

టాలీవుడ్ కు కూడా స్పెషల్ సాంగ్స్ పిచ్చి పట్టింది. టాలీవుడ్ జనాలు కూడా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఐటెం సాంగ్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తే.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ గురించి వస్తున్న న్యూస్ టాలీవుడ్ ను ఊపేస్తోంది. సినిమాలు ఎలా ఉన్నా సరే స్పెషల్ సాంగ్ తో నెట్టుకు రావచ్చు అని నిర్మాతలు, డైరెక్టర్లు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగులో కూడా గట్టిగానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి.
స్టార్ హీరోలు సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు స్పెషల్ సాంగ్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం మాజీ హీరోయిన్లను లైన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సినిమా అనగానే పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ క్రియేట్ అయిపోతుంది. అలాంటి సినిమాకు క్రేజ్ మరింత పెంచడానికి… అలాగే తమిళ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ కు తమిళ, కన్నడ మార్కెట్ కాస్త డల్ గా ఉంటుంది. అందుకే ఆ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు డైరెక్టర్లు రెడీ అవుతున్నారు. రాజా సాబ్ సినిమా మేలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ మారుతి భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం.. ఓ మాజీ స్టార్ హీరోయిన్ ను డైరెక్టర్ ఒప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పేర్లను పరిశీలించిన డైరెక్టర్ ఓ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ పక్కన యోగి సినిమాలో నటించిన నయనతారను, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మారుతి ఆల్మోస్ట్ ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
ముందు శ్రేయ అనుకున్నా ఆమె అందుబాటులో లేకపోవడంతో నయనతార పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీళ్లిద్దరూ దాదాపు 17 ఏళ్ల క్రితం యోగి సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా ప్రభాస్ కెరియర్ లో మంచి సినిమా గానే చెప్తూ ఉంటారు. ఇక ప్రభాస్ అలాగే నయనతార కాంబినేషన్ అప్పట్లో ఫ్యాన్స్ కు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ ను మళ్లీ రిపీట్ చేసేందుకు డైరెక్టర్ మారుతి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆమెకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు పాత్ర ఇచ్చి ఆ తర్వాత స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక నయనతార కూడా ప్రభాస్ సినిమా కాబట్టి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది.