Prabhas Raja Saab : తుస్సుమనించిన రాజా సాబ్.. ఏముంది.. నా బొకే..
బాహుబలి (Baahubali) తర్వాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్ (Prabhas) నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఫాన్స్ మాత్రం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా వస్తే పండగే అన్నట్టుగా ఫాన్స్ లో వాతావరణం ఉంది. ఇప్పుడు మనోడు... రాజా సాబ్ (Raja Saab) అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక సినిమాను తెరకేక్కిస్తున్నాడు.

బాహుబలి (Baahubali) తర్వాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్ (Prabhas) నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఫాన్స్ మాత్రం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా వస్తే పండగే అన్నట్టుగా ఫాన్స్ లో వాతావరణం ఉంది. ఇప్పుడు మనోడు… రాజా సాబ్ (Raja Saab) అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక సినిమాను తెరకేక్కిస్తున్నాడు. మారుతి దర్శకత్వం (Director Maruti) లో వస్తున్న ఈ సినిమా హింది, ఇంగ్లీష్ తో పాటుగా మన అన్ని దక్షినాది భాషల్లో విడుదల కానుంది. కల్కి రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ వేగం పెంచేసాడు ప్రభాస్.
ఇక ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. కాసేపటి క్రితం వచ్చిన ఈ గ్లింప్స్ లో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించాడు. బాహుబలి నుంచి దాదాపు అన్ని సినిమాలు యాక్షన్ కోణంలోనే చేస్తున్న ఈ రాజు గారి అబ్బాయి కొత్తగా లవర్ బాయ్ (Lover Boy) గెటప్ లో కనిపించాడు. 45 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ లో ప్రభాస్ బైక్ పై బోకే పట్టుకుని రావడం, బోకే తో బైక్ దిగి అక్కడి నుంచి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళే ఒక సీన్ లా ఈ గ్లింప్స్ ఉంది. పూర్తిగా సాఫ్ట్ లుక్ లోనే ప్రభాస్ కనిపించాడు. ఐతే ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ కనపడుతున్నాయి. ముదురు ఫేస్ లా ప్రభాస్ ది అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఫేస్ లో లవర్ బాయ్ లుక్స్ పోయాయని, అందుకే రాదే శ్యాం (Radhe Shyam) లో కూడా ప్రభాస్ లుక్ అంత ఆకట్టుకోలేదని కామెంట్స్ చూసాం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రభాస్ ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.