Anil Ravipudi: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దర్ని బుట్టలో పడేసిన దేశ ముదురు..
అనిల్ రావిపుడి నిజానికి రాజమౌళి లా పాన్ ఇండియా మూవీలు చేయలేదు. సుకుమార్ లా పుష్పరాజ్ లను రెడీ చేయలేదు. కాని వాళ్లందరి కన్నా, అవసరమైతే త్రివిక్రమ్ కంటే కూడా దేశముదురనిపించుకుంటున్నాడు. తన విషయంలో సందీప్ రెడ్డి వంగ కూడా నథింగ్ అనే పరిస్తితి వచ్చింది.

Anil Ravipudi Movie Making Strategy With Star Heros
కారణం ఆరునెల్లకో మూవీ, ప్రతీ ఏడాది కనీసం ఒక స్టార్ హీరోతో సినిమా అంటూ జక్కన్న, త్రివిక్రమ్, సుకుమార్, సందీప్ కి సాధ్యం కాని ఫీట్లు చేస్తున్నాడు. బాలయ్యతో భగవంత్ కేసరి తీస్తున్న తను, తర్వాత ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టేశాడు. కథచెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా సెట్స్ పైకెళ్లొచ్చని కూడా తెలుస్తోంది.
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీ చేయనున్న రామ్ చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు అనిల్ రావిపుడి. బుచ్చి బాబు, సుజీత్ లాంటి దర్శకుడు ఒక మూవీ తర్వాత మరో సినిమా చేసేందుకు ఏళ్లుగా వేయిట్ చేస్తుంటే, ఈ ఏడాది బాలయ్యతో వచ్చే ఏడాది తారక్ తో నెక్ట్స్ ఇయర్ దసరాకు రామ్ చరణ్ తో అంటూ ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నాడు అనిల్ రావిపుడి. అంతేకాదు, మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఎఫ్ 2, ఎఫ్ 3, ఎఫ్ 4 అంటూ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. అలా తనకి గ్యాప్ ఉండట్లేదు. పెద్ద హీరోల కోసం వేయిట్ చేయకున్నా టైం కలిసొస్తోంది. ఇది సింపుల్ గా అనిల్ రావిపుడి స్ట్రాటజీ.