బన్నీ అరెస్టు తర్వాత… మోహన్ బాబేనా… 1000 కోట్ల బంధం..?
టాలీవుడ్ లో అరెస్టులు గోలా షాక్ ఇస్తోంది... 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఆనందం అరక్షణమైనా లేదు. ఇంతలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నిజంగా టాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. ఏదో తీసుకెళ్లారు వాకబు చేసి పంపించేస్తారనుకున్నారు కాని ఎవరూ ఇది ఊహించలేదు.
టాలీవుడ్ లో అరెస్టులు గోలా షాక్ ఇస్తోంది… 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఆనందం అరక్షణమైనా లేదు. ఇంతలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నిజంగా టాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. ఏదో తీసుకెళ్లారు వాకబు చేసి పంపించేస్తారనుకున్నారు కాని ఎవరూ ఇది ఊహించలేదు. బేయిలైతే వచ్చింది కాని, కథ అప్పుడే పూర్తయ్యేలా లేదు. కట్ చేస్లే మరో అరెస్ట్ కి రంగం సిద్దమైంది. ఈసారి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంతొచ్చినట్టుంది. తనకు ముందస్తు బేయిల్ రద్దైంది.. హైకోర్ట్ ఇచ్చిన షాక్ కి సీన్ రివర్స్ అయ్యింది. పెద్ద స్టార్లైనంత మాత్రాన కేస్ బలంగా ఉంటే, కటకటాల పాలవక తప్పదని తెలుస్తోందా? అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రాజకీయ కారనాలంటున్నారు. కాని మోహన్ బాబు అరెస్ట్ కాబోతున్నాడంటూనే, ఆల్రెడీ అరెస్టైన అల్లు అర్జున్ కి, కలెక్షన్ కింగ్ తో 1000 కోట్ల పోలిక పెట్టారు. ఈ వెయ్యికోట్ల కనెక్షన్ ఏంటి? అరెస్టులతో ఏం తేలుతోంది. అసలేం జరుగుతోంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ నిజంగా పాన్ ఇండియా లెవల్లో అందరినీ షాక్ కి గురిచేస్తోంది. పుష్ప2 మూవీకి 1000 కోట్ల వసూల్లు రాబట్టిందని ఫిల్మ్ టీం సంబరాలు చేసుకునే టైంలో ఇది బిగ్ షాక్… నాంపల్లి కోర్టు కూడా పోలీస్ రిమాండ్ కే సపోర్ట్ చేయటంతో అంతా మరింత షాకయ్యారు. కట్ చేస్తే హైకోర్టు మధ్యంతర బేయిల్ ఇచ్చింది.
మొత్తానికి ప్రజెంట్ ఐకాన్ స్టార్ వంతైపోయింది ఇక మీదట నెక్ట్స్ మోహన్ బాబే అంటున్నారు. జర్నలిస్ట్ మీద దాడి వల్ల మోహన్ బాబు మీద కేస్ ఫైల్ అవటం, తను హైకోర్టుని ముందస్తు బేయిల్ కోసం అప్రోచ్ అవటం జరిగందన్నారు. కట్ చేస్తే కోర్టులో చుక్కెదురైంది. తన అప్రోచ్ ని కోర్ట్ కొట్టేసింది.
అంటే మోహన్ బాబుని అరెస్ట్ ఆల్ మోస్ట్ కన్పామ్ అయినట్టే.. కాకపోతే ఇక్కడ బన్నీ, మోహన్ బాబు ఇన్స్ డెంట్ లో కామన్ పాయింట్ వెయ్యికోట్లు… కలెక్షన్ కింగ్ గా ఫోకస్ అయిన మోహన్ బాబు ఆస్తులు వెయ్యికోట్లుంటాయట. వాటి పంపకాల విషయంలోనే మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరగుతున్నాయని, పెద్దకొడుకునే మోహన్ బాబు దగ్గర తీసి, చిన్న కొడుకుకి అన్యాయం చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇక బన్నీ నేనమో ఫస్ట్ టైం వెయ్యికోట్ల క్లబ్ లోచేరిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. కాకపోతే ఈ ఇద్దరికి వెయ్యి నెంబరే కలిసి రానట్టుంది. ఒకరు వెయ్యికోట్ల ఆస్తి వల్ల జైలుకెళ్లాల్సి వస్తుంటే, మరొకరు వెయ్యికోట్ల కలెక్సన్స్ తర్వాత అరెస్ట్, తర్వాత బేయిలు ఇలా సీన్ మారిపోయింది. ఒకరి ప్రాణం పోవటం వెనక బన్నీ ప్రత్యక్ష కారణం కాకున్నా, లీగల్ గా చాలా రూల్స్ ఫాలో కాకపోవటం వల్లే సంధ్యా థియేటర్ దగ్గర ఒక వ్యక్తి ప్రాణం పోవటానికి కారణమైందనేదే కేసు…
ఏదేమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటూనే, తాను ఎందులో జోక్యం చేసుకోనన్నాడు.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చేప్పుడు కూడా తెలంగాణ సీఎం ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడు. అందుకే బన్నీకి ఇక కష్టాలు తప్పవా అనుకున్నారు. కాని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతొ ఊపిరిపీల్చుకున్నాడు. ఐతే ఒకటి మాత్రం కన్ఫామ్, కేసుబలంగా ఉంటే ఎంతటివాళ్లైనా ఊచలు లెక్కపెట్టాల్సివస్తుందని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ లో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లే కటకటాలులెక్కపెట్టాల్స వచ్చింది.
కన్నడ యాక్టర్ దర్శన్ అయితే జైలు పాలై, చిప్పకూడు రుచి చూడక తప్పలేదు. షారుఖ్ ఖాన్ కొడుకే డ్రగ్స్ కేసులో నరకం అనుభవించాడు. నిజంగా ఇందులో ఎవరు దోషీ అనే విషయం పక్కన పెడితే, కొన్ని సార్లు కేసుల్లో డోస్ గట్టిగా ఉంటే, ఎంతటి స్టారైనా కటకటాలు పాలవ్వాల్సిందే అని తేలుతోంది. కాని బన్నీ విషయంలోనే ఊహాతీతంగా అరెస్ట్ , బేయిలు ఇలా సినిమాటిక్ సీన్లల షాకులు ఎక్కువయ్యాయి.