Chiranjeevi: మెగాస్టార్ తర్వాత ఆ స్థానం ఎవరిది..? చరణ్ కాదా..?
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరు వచ్చాడు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. చిరు ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలేయట్లేదు. అయితే, ఇప్పుడు ఆయన తర్వాత ఎవరనే ప్రశ్న ఎదురవుతోంది. అలాగే కోలీవుడ్‌లో రజినీ, కమల్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వాళ్లెవరనే ప్రశ్న ఎదురవుతోంది.
Chiranjeevi: టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే చిరంజీవి ఒక్కడే. ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా, తిరిగి మళ్లీ సినిమాల్లోకి వచ్చినా ఇండస్ట్రీలో తన స్థానం అలానే ఉంది. మరో 3 ఏళ్లలో చిరంజీవి 70ల్లోకి అడుగుపెడతారు. ఆ తర్వాత సినిమాలు తక్కువగానే చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్.. మెగాస్టార్ తర్వాత ఆ స్థానం ఎవరిది..?
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరు వచ్చాడు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. చిరు ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలేయట్లేదు. అయితే, ఇప్పుడు ఆయన తర్వాత ఎవరనే ప్రశ్న ఎదురవుతోంది. అలాగే కోలీవుడ్‌లో రజినీ, కమల్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వాళ్లెవరనే ప్రశ్న ఎదురవుతోంది. దానికి కారణం వాళ్ల వయసు 70 దాటడమే. అలానే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా 70లో పడ్డాకే, వాళ్ల స్థానాన్ని దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ రీప్లేస్ చేస్తారన్నారు. కానీ కోలీవు్డ్‍లో రజినీ, కమల్‌కి రీప్లేస్‌మెంట్ కష్టమే అంటున్నారు విశ్లేషకులు. అలాగే టాలీవుడ్‌లో చిరు ప్లేస్‌లో నిలుచుని, ఆ స్థాయిలో నెంబర్ వన్ అనిపించుకునే ఛాన్స్ మరెవరికీ లేదా? అంటే చాలా విషయాల్నే చూడాలి.
చిరు తమ్ముడు పవన్‌కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. కాని కేవలం క్రేజ్ మాత్రమే కాదు, నటన, డాన్స్ ఇలా అన్నీ లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా చూస్తే చెర్రీ చిరు వారసుడే.. కాని చిరు స్థానాన్ని భర్తీ చేస్తాడనలేం. మహేశ్, ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అవ్వొచ్చు కాని మరో మెగాస్టార్ అనే పరిస్థితి లేదు. అలాగే బన్నీ, ఎన్టీఆర్ వాళ్ల దారుల్లో వాళ్లు బడా స్టార్స్ అనిపించుకుంటున్నారు. సో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా, మరోకటి ఉన్నా మెగాస్టార్ స్థానాన్ని రీప్లేస్ చేసే కటౌట్ అయితే ఇప్పట్లో కష్టమే..!