Buchibabu – Clarity : చెర్రీ – బుచ్చిబాబు మూవీలో కిక్ శ్యామ్
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారని క్లారిటీ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే పిరియాడిక్ విలేజ్ డ్రామాకి సంబంధించి రోజుకో అప్ డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేస్తోంది. లేటెస్ట్ గా రివీల్ అయిన అప్డేట్స్ మూవీపై ఫుల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

After Game Changer, Ram Charan is going to do a movie under the direction of Buchibabu - Clarity Cherry - Kick Shyam in Buchibabu Movie
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారని క్లారిటీ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే పిరియాడిక్ విలేజ్ డ్రామాకి సంబంధించి రోజుకో అప్ డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేస్తోంది. లేటెస్ట్ గా రివీల్ అయిన అప్డేట్స్ మూవీపై ఫుల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ట్ అయ్యే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం గా కొనసాగడంతో ఆ ఎఫెక్ట్ తర్వాతి మూవీపై పడేలా ఉంది. ఏదేమైనా గేమ్ ఛేంజర్ షూటింగ్ 2024 ఫిబ్రవరిలో పూర్తి చేసి వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్టు ప్రారంభించే ప్లాన్ లో ఉన్నాడు చెర్రీ. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే కిక్ శ్యామ్ ఇందులో భాగం కాబోతున్నాడు. రవితేజతో కలసి నటించిన కిక్, బన్నీతో కలసి నటించిన రేసుగుర్రం సూపర్ సక్సెస్ అయ్యాయి. స్టార్ హీరో మూవీస్ లో కిక్ శ్యామ్ ఉంటే సక్సెస్ పక్కా అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. పైగా బుచ్చిబాబు మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కిక్ శ్యామ్ ని తీసుకున్నారట.
Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో సంచలన నిర్ణయం.. విజయ్ సేతుపతి షాకింగ్ డెసిషన్..
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్న ఈ మూవీ కోసం ఆర్టిస్టులకు అందర్నీ సెట్ చేసి పెడుతున్నాడు బుచ్చిబాబు. చెర్రీ డేట్స్ ఇవ్వడమే తరువాయి షూటింగ్ ప్రారంభించి..శరవేగంగా పూర్తి చేసి..వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే టీమ్ మొత్తం ఫైనల్ అయింది కానీ హీరోయిన్ ఎవరన్నది ఇప్పటికీ సెట్ అవలేదు. జాన్వీ కపూర్ ఫిక్స్ అన్నారు.. కాదు కాదు మృణాళ్ ఫైనల్ అన్నారు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కదా సాయిపల్లవిని తీసుకుంటున్నారనే టాక్ వచ్చింది. ఇప్పటికీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడానికి డైరెక్టర్ పెట్టిన ఆ కండిషన్ కారణం అనే టాక్ వినిపిస్తోంది..
ఇప్పటికే మూవీ లేటవడంతో.. ఒక్కసారి ప్రారంభమైతే షూటింగ్ కి అసలు బ్రేక్ తీసుకోకూడదనే ఆలోచనలో ఉన్నాడట బుచ్చిబాబు. ఆ సమయంలో హీరోయిన్ రెండు మూడు సినిమాలకు కమిటైతే బల్క్ డేట్స్ దొరకడం కష్టమే. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే దేవరతో బిజీగా ఉన్న జాన్విని వద్దనుకున్నారని టాక్. మృణాల్ కూతడా బిజీగా ఉంది. మరి సాయిపల్లవి సంగతేంటని ఇంకా క్లారిటీ రాలేదు. శంకర్ సినిమా పూర్తైన తర్వాత చరణ్ డేట్స్ మొత్తం బుచ్చిబాబుకి కేటాయిస్తే ఆమూవీ కూడా ఆరు నెలల గ్యాప్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరి RC 16 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ అండ్ సీ..