ఎన్టీఆర్ తర్వాత నాని మీదే దాడి… గజ్జికుక్కలకు సమాధానం…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద కామెంట్లు, ట్రోలింగ్స్ అంటే యాంటీ ఫ్యాన్స్ కి పండగ. బాలీవుడ్ లో అయితే తన మీద పైశాచికంగా కామెంట్లు, రూమర్లతో దాడి చేసేందుకు సెపరేట్ బ్యాచుంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 09:30 PMLast Updated on: Apr 04, 2025 | 9:30 PM

After Ntr Nani Is The One Who Is Attacked The Answer To The Scabies Dogs

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద కామెంట్లు, ట్రోలింగ్స్ అంటే యాంటీ ఫ్యాన్స్ కి పండగ. బాలీవుడ్ లో అయితే తన మీద పైశాచికంగా కామెంట్లు, రూమర్లతో దాడి చేసేందుకు సెపరేట్ బ్యాచుంది. ఐనా త్రిబుల్ ఆర్, దేవర రిజల్ట్ ని ఎవరి కామెంట్లు, ట్రోలింగ్స్ ఏం చేయలేకపోయాయి. కట్ చేస్తే మహేశ్, ప్రభాస్ కంటే భారీగా యాంటీ ఫ్యాన్స్ సోసల్ మీడియా వార్ కి ఎన్టీఆర్ గురైనట్టు, న్యాచురల్ స్టార్ కి అదే జరుగుతోంది. అసలు టైం పాస్ బ్యాచ్ ఏదో ట్రోలింగ్స్ చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. కాని పువ్వు పుట్టగానే నలిపేసే రేంజ్ లో రూమర్స్ క్రియేట్ చేస్తోంది, ఓ సోషల్ సైకో బ్యాచ్. వాళ్ల విషయంలోనే నాని టీం ఘాటుగా రిప్లై ఇచ్చింది. గజ్జికుక్కలంటూ ఫైర్ అయ్యింది. అదే కాస్త మిస్ ఫైర్ అయ్యిందా? లేదంటే కుక్కకాటుకి చెప్పుదెబ్బే కరెక్ట్ అని టాక్ పెరిగిందా? ఈ విషయంలో ఎన్టీఆర్ టీం కూడా అలర్ట్ అయ్యి ఏం చేస్తోంది? హావేలుక్

న్యాచురల్ స్టార్ నాని పెద్ద మాస్ హీరో కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో తప్ప, యూత్ లోకూడా ఓమాదిరీ అటెన్షనే ఉంటుందనే కామెంట్స్ ఉన్నాయి. మంచి నటుడు కావొచ్చు కాని, ఊర మాస్ ఇమేజ్ మాత్రం తనకి సొంతం కాలేదు. దసరాలాంటి హిట్లు పడ్డా తెలంగాణ వరకు ఓకే కాని, ఓవరాల్ గా మాస్ మార్కెట్ పెరగలేదు. అలాంటి హీరో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదేలా మేకింగ్ లో మరో మాస్ మూవీ చేస్తున్నాడు. అదే ప్యారడైజ్… విచిత్రం ఏంటంటే ఈ మూవీ కథ బాలేదని, నానికి నచ్చకపోవటం తోపాటు బడ్జెట్ సమస్యొచ్చి ఆగిందని రూమర్స్ వచ్చాయి. అంతే వెంటనే, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న జోకర్స్ కి ఇదే సమాధానం అంటూ నాని టీం విరుచుకుపడింది.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గజరాజు నడిస్తే కుక్కలు అరుస్తాయంటూ భారీ స్టేట్ మెంట్ ని పారడైజ్ టీం పోస్ట్ చేసింది. వస్తున్న రూమర్స్ నిజంకాదని, తమ టీం ప్రౌడ్ గా ఫీలయ్యే గొప్ప ప్రాజెక్ట్ చేస్తున్నామన్నంతవరకు ఓకే, కాని రూమర్లు స్ప్రెడ్ చేస్తున్న బ్యాచ్ ని గజ్జికుక్కలనటం షాకింగ్ గా ఉంది.అలా అనుకుంటేన, రూమర్లు లేని రోజు, రూమర్లు ఫేస్ చేయని హీరో ఉండడు. కాబట్టి నెగెటివ్ వార్తలని, ప్రచారాలని ఖండించటం కూడా చూశాం. కాని ఇంత కసిగా, గజ్జికుక్కలనే పదం వాడేంతగా ప్యారడైజ్ టీం, ఎదురుదాడికి దిగటం వెనక సాలిడ్ రీజనుంది.

ఒకప్పుడు సినిమాల మీద రూమర్లు కామన్ గా వచ్చేవి. ఇప్పుడు ట్రోలింగ్స్ కూడా డబ్బిచ్చి మరీ చేయిస్తున్నారు. పలానా హీరోమీద బురద చల్లేందుకు డబ్బులు పోస్తున్నారు. ఆ కోపంతోనే, తన మీద బురద చల్లేందుకు చాలా యాంటీ టీమ్స్ పని చేస్తున్నాయట. సాధారణంగా ఒక హీరో ఫ్యాన్స్ మరో స్టార్ ని టార్గెట్ చేయటం కామన్ గా జరుగుతుంది.

కానిఇది ప్రొఫేషనల్ గా జరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీదేవర రిలీజ్ ముందు కూడా ఇలానే జరిగింది. గేమ్ ఛేంజర్ టైంలో ఛరన్ కి ఇలాంటి అనుభవమే జరిగింది. ప్రభాస్, మహేశ్ మీద కూడా ఇలాంటి దాడులు కొత్తేం కాదు. కాకపోతే యాంటీ ఫ్యాన్స్ కామెంట్ల వరకే పరిమితమైతే, అందులో కొందరు, డబ్బులు తీసుకుని మరీ, నెగెటీవిటీని స్పెడ్ చేస్తున్నారట. అలాంటి వాళ్లని నాని టీం ఫిజికల్ గా చూడటం వల్లే, ఇంత ఘాటుగా రిప్లై ఇచ్చిందట. సైబర్ క్రైమ్ పోలీసులని కూడా అప్రోచ్ అయ్యే పనిలో ఉన్న నానిటీం, ఆ పని చేస్తూనే ఇలా రూమర్ల బ్యాచ్ కి ట్విట్టర్ పంచ్ ఇచ్చిందని తెలుస్తోంది.