రజినీకాంత్ తర్వాత జపాన్ లో ఎన్టీఆరే… 21 నెలల రికార్డు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జపాన్ లో రోజు రోజుకి ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ రాకముందే, జపాన్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. యూట్యూబ్ లో దుమ్ముదులిపిన తన పాత సినిమాలే, జపాన్ లోతనకా రేంజ్ ఫ్యాన్ బేస్ కి అక్కడ క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2024 | 01:31 PMLast Updated on: Oct 19, 2024 | 1:31 PM

After Rajinikanth Ntrs Record In Japan 21 Months

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జపాన్ లో రోజు రోజుకి ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ రాకముందే, జపాన్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. యూట్యూబ్ లో దుమ్ముదులిపిన తన పాత సినిమాలే, జపాన్ లోతనకా రేంజ్ ఫ్యాన్ బేస్ కి అక్కడ క్రియేట్ చేసింది. కనీసం చరణ్, ప్రభాస్, బన్నీ అండ్ కోకి జపాన్ లో గుర్తింపు దక్కిందంటే, అక్కడ వీళ్ల పాన్ ఇండియా హిట్ మూవీస్ అక్కడ రిలీజయ్యాయి. ట్రెండ్ సెట్ చేశాయి. కాని త్రిబుల్ ఆర్ రాకముందే, ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ బలంగా ఉంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ 21 నెలలుగా అక్కడ 72 ఏళ్ల చరిత్ర ఉన్న థియేటర్స్ లో అడటమే ఓ రికార్డుగా మారింది. దీనికి తోడు, తన కొత్త పాత పాటలకు కవర్ డాన్స్ లు చేసే జపనీస్ సంఖ్య యూ ట్యూబ్ లో ప్రతీ ఏడాది పెరిగిపోతోంది. అంతగా ఎన్టీఆర్ ఏం మ్యాజిక్ చేశాడు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని మించేలా జపాన్ లో ఎన్టీఆర్ ఏం మాయ చేశాడు? ఇంకేం చేయబోతున్నాడు?

దేవర దరువుకి మూడు వారాలు… అయినా ఇంకా ఎక్కడ తన జోరు తగ్గలేదు. ఇలాంటి టైంలో మరో రికార్డు తన ఎకౌంట్ లోపడింది. అదే జపాన్ లో తన హిట్ మూవీ త్రిబుల్ ఆర్ 21 నెలలు కంటిన్యూయస్ గా 72 ఏళ్లచరిత్ర ఉన్న థియేటర్ లో ఆడటం.. ఇది రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన ప్రయోగమే. కాని ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మూవీలు చేయకముందే జైలవకుశకమంటే కూడా ముందునుంచే జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

ఒకప్పుడు తమిళ సూపర్ స్టార్ కోసం జపనీస్ ఇండియాకొచ్చి తనతో ఫోటోదిగేవాళ్లని విన్నాం. తన ముత్తుమూవీ నుంచే అక్కడ రజినీకాంత్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూశాం.. విచిత్రం ఏంటంటే, ఈ రేంజ్ ఇమేజ్, ఫాలోయింగ్ అక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఉంది.. కాకపోతే, అదంతా బాహుబలి 1, బాహుబలి 2 తర్వాతే తనకి క్రియేట్ అయ్యింది.

అయితే తెలుగు హీరోల్లో ప్రభాస్, చరణ్, బన్నీ కంటే ముందే 12 ఏళ్ల క్రితం నుంచే జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన డాన్స్ కి, పాటలకి అక్కడ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన భాషరాకున్నా, తెలుగు అర్ధం కాకున్నా, తారక్ పాటలకు డాన్స్ చేసే జపనీస్ బ్యాచ్ ఉండేది. జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ టైంలో కూడా జపాన్ నుంచి ఇండియాకొచ్చి తన ఆటో గ్రాఫ్, ఫోటో గ్రాఫ్ కోసం సెట్ లో సందడి కూడా చేశారు.

ఇదంతా తన మాస్ మూవీలు యూ ట్యూబ్ లో ఎలాగైతే నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి దగ్గరయ్యాయో, అలానే జపనీస్ లో కూడా చాలా మందికి నచ్చాయి. అలా 12 ఏళ్ల నుంచి అంటే బాహుబలి జమానా మొదలవ్వడానికి మూడేళ్ల ముందునుంచే తనకి జపాన్ లో ఫాలోయింగ్ ఉంది. అదే ఓరకంగా త్రిబుల్ ఆర్ ని జపాన్ లో 21 నెలలు ఆగకుండా ఆడేలా చేసింది. పాన్ ఇండియా లెవల్లో త్రిబుల్ ఆర్ వల్ల ఇందులో రామ్ చరణ్ పాత్రకే కాస్త వేయిట్ ఎక్కువుండటంతో తనకి అక్కడ ప్లస్ అయినా, జపాన్ లో మాత్రం ఎన్టీఆర్ పాత్రకే జనం ఫిదా అయ్యారు.

ఇక దేవర విషయానికొస్తే ఈ సినిమా జపనీస్ భాషలో రిలీజ్ కాబోతోంది. 2025 ఉగాదికి అక్కడ ఈ మూవీ విడుదలయ్యే ఛాన్స్ఉంది. త్రిబుల్ ఆర్ ని 21 నెలలు ఆడించిన 72 ఏళ్ల చరిత్ర ఉన్న, జపనీస్ థియేటర్ లోనే దేవర మొదటి ఆటపడేలా ప్రయత్నాలు మొదలయ్యాయట. ఆల్రెడీ ఈ సినిమా లో పాటలకి కవర్ అప్ సాంగ్స్, కవర్ అప్ డాన్స్ వీడియోలు యూ ట్యూబ్ లో దూసుకెళుతున్నాయి. తన ప్రతీ మూవీ పాటకు డాన్స్ చేసే ఓ జంట ఆల్రెడీ తమ పెర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ అభిమానులనే కాదు, ఇండియన్ నెటెజన్స కి కూడా షాక్ ఇస్తోంది

ఎలా చూసినా సూపర్ స్టార్ రజినీకాంత్ కి జపాన్ వరకు తన ఫ్యాన్ బేస్ కి పెంచుకునేందుకు మూడు నాలుగు దశబ్ధాలు ప్టటింది. రెబల్ స్టార్ ప్రభాస్ కి కనీసం రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లుతో తనేంటో ప్రూవ్ చేసుకన్నాకే, అదే మూవీ జపాన్ లో దుమ్ముదులిపి తనకి ఫ్యాన్ బేస్ కి క్రియేట్ చేసింది. ఇవేవి లేకున్నా, కేవలం తన తెలుగు సినిమాలతోనే జపనీస్ అటెన్షన్ లాక్కున్నాడు తారక్. ఇది నిజంగా ఓ విచిత్రమే.. కాని తన లైఫ్ లో అలాంటివి ఎన్నో.. లావుగా ఉన్న తను యమదొంగటైంలో సన్నబడటం, ఆంధ్రావాలాతో చిన్న వయసులోనే తండ్రి కొడుకుల పాత్రలు వేయటం, జైలవకుశలో మూడు పాత్రలు వేస్తూనే అందులో విలన్ గా కనిపించటం… వీటికి తోడు త్రిబుల్ ఆర్, దేవర రికార్డులు…మొత్తంగా తనని నిధానంగా గ్లోబల్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారుస్తున్నాయి.