Vijay Thalapathy : వామ్మో ఒక్క శాటిలైట్ హక్కులే అన్ని కోట్లా
సూపర్ స్టార్ రజనీ తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ దళపతి. అంతెందుకు.. ఒక కోలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు.

After superstar Rajini, Kollywood hero Vijay Dalapathy has a market in that range in Tollywood.
సూపర్ స్టార్ రజనీ తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ దళపతి. అంతెందుకు.. ఒక కోలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. లియో సినిమాతో అది కూడా జరిగిపోయింది. ఇక తమిళనాట విజయ్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అక్కడ పెద్ద పండగే. ఇక డే1 నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. ఆయన ఓపెనింగ్స్ రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఆ మధ్య ఓ సందర్భంలో దిల్ రాజు చెప్పినట్లు… విజయ్ సినిమాలు టాక్ తో సంబంధంలేకుండా కోట్లు కొల్లగొడుతుంటాయని చెప్పాడు.
దిల్ రాజు చెప్పినట్లే… ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం నిర్మాతలకు ప్రాఫిట్ వెంచర్‌లా మారిపోతాయి. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘బీస్ట్’ సైతం రెండొందల కోట్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు. ఇక గతేడాది దసరాకు రిలీజైన ‘లియో’ ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టి ఆహా అనిపించింది. అలాంటిది ఇప్పుడు విజయ్… సినిమాలకు గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ ఇంకా డైజెస్ట్ కాలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ సినిమాలు మానేయడం తమిళ సినిమా బిజినెస్ కు బాగా దెబ్బపడుతుందని.. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ మంచి బిజినెస్‌ను చేస్తాయని మాట్లాడుకుంటున్నారు.
ఇక విజయ్ అభిమానులు బాధ అంతా ఇంతా కాదు. ఇలా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లడం ఫ్యాన్స్ ను బాధిస్తుంది. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేసుకోవచ్చు కదా అని ఫీలైపోతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ గ్రేెటెస్ట్ ఆఫ్ అల్ టైమ్ అనే సినిమ ా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయిందని ఇన్ సైడ్ టాక్.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. మరీ ముఖ్యంగా కేవలం శాటిలైట్ హక్కులే రూ.90 కోట్ల వరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఒక్క శాటిలైట్ హక్కులనే అన్ని కోట్లంటే మాములు విషయం కాదు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనితో పాటుగా విజయ్ తన చివరి సినిమాను హెచ్. వినోద్ తో చేయబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట.