Kalki Prerelease Event : అమరావతిలో ఇక సినిమా ఫంక్షన్‌లు..
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. పరిస్థితులు కూడా మారుతున్నాయ్. ముఖ్యంగా సినిమావాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.

After the change of government in AP.. the situation is also changing.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. పరిస్థితులు కూడా మారుతున్నాయ్. ముఖ్యంగా సినిమావాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోందా… త్వరలో అక్కడ రెండు పెద్ద ఈవెంట్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్నేహితుడు రజనీకాంత్ వచ్చాడు.
ఈ సందర్భంగా బాలయ్య సూపర్‌స్టార్‌కు స్వాగతం పలకగా.. మోడీ కలిసి ముచ్చటించాడు. చూస్తుంటే… రజనీకాంత్ ఈనెల 23న మరోసారి అమరావతికి వచ్చే అవకాశం వుంది. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 23న అమరావతిలో చేయాలని నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేశాడు. భారీ తారాగణం అమితాబ్.. ప్రభాస్..దుల్కర్.. దీపిక, దిశాతో కల్కి రూపొందింది. అమరావతిలో జరిగే ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథులుగా రజనీకాంత్‌తోపాటు.. చంద్రబాబు కూడా వస్తారని సమాచారం.
చంద్రబాబుతో మంచి అనుబంధం వున్న అశ్వనీదత్.. అమరావతిని ప్రోత్సహించే క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్కడే పెడుతున్నారట. కల్కి ప్రీరిలీజ్‌తో అమరావతిలో సినిమా సందడి మొదలుకానుంది.. బాలకృష్ణ, బోయపాటి సినిమాను కూడా అమరావతిలో లాంఛనంగా ప్రారంభిస్తారట. చంద్రబాబుతో మంచి అనుబంధం వున్న దర్శకనిర్మాతలు అమరావతిలో ఈవెంట్స్… షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.