Venkateshwar : వెంకీ మామ సినిమాకి సంస్కారవంతమైన టైటిల్
F2', 'F3' సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.

After the films 'F2' and 'F3', Victory Venkatesh and director Anil Ravipudi have joined hands for the third time.
F2′, ‘F3’ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జులై 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఓ క్రేజీ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఎక్స్ లెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథగా ఈ చిత్రం రాబోతుంది. ఇందులో ఎక్స్ లెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ కాప్ గా వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి అలరించనున్నారు. ఆ మూడు పాత్రలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి ట్రిపుల్ ఎక్స్ అనే క్యాచీ టైటిల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
పలకడానికి ‘ఆర్ఆర్ఆర్’ లా ఉండటంతో పాటు.. ‘F2’, ‘F3’ తరహాలోనే షార్ట్ అండ్ క్యాచీ టైటిల్ కావడంతో.. అనిల్ రావిపూడి ‘XXX’ను ఫైనల్ చేసినట్లు వినికిడి.
ఇక తెలుగు ఆడియన్స్ కి ‘XXX’ అనే టైటిల్ వినగానే.. “సంస్కారవంతమైన సోప్” అనే యాడ్ గుర్తుకురావడం సహజం. ఆ రకంగా కూడా ఈ సినిమాకి బోలెడంత పబ్లిసిటీ అవుతుంది.