Cool Cut Hrithik Roshan : కూల్ కట్ చేసుకున్న హృతిక్ ..
వార్2 తర్వాత క్రిష్ 4 ని స్టార్ట్ చేసేలా కాల్ షిట్స్ ని కేటాయించాడు హృతిక్. ఇప్పటికే క్రిష్ కి సంబందించిన మెయిన్ ప్లాట్ సిద్ధం అయింది. షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు గ్రాఫిక్ వర్క్ పై ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ కరణ్ మల్హోత్రా. 2024 ద్వితీయార్థంలో క్రిష్ ని స్టార్ట్ చేసేలా ప్రణాళిక జరుగుతున్నాయి.

After War2 Hrithik allocated call sheets to start Krrish 4 The main plot related to Krrish is already prepared Along with the shooting schedules, director Karan Malhotra focused on the graphic work
బీటౌన్ లో ట్రెండ్ మారింది. స్పై జోనర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కలెక్షన్స్ వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన గ్రీక్ గార్డ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతున్నాడు. రెండేళ్లలో 3 క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసేలా పక్క ప్రణాళికను అప్లై చేస్తున్నాడు.
వార్ మూవీ బౌన్స్ బ్యాక్ అయిన హృతిక్ విక్రమ్ వేద తో సరికొత్త వర్షన్ చూపించాడు. ప్రజెంట్ టైగర్ లో గెస్ట్ అపియరెన్స్ ఇస్తూనే సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే 60% షూటింగ్ ఫినిష్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరిలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో హృతిక్ పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో బిజీ అయింది యూనిట్. రీసెంట్ గా ఇటలీకి పయనమైంది టీం. అక్కడ రెండు పాటలు చిత్రీకరించనుంది. హృతిక్ ,దీపికల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్, గ్రీక్ గార్డ్ పై సోలో సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఫైటర్ షూటింగ్ ని అక్టోబర్ కల్లా పూర్తి చేసి నవంబర్ లో వార్ 2 ని స్టార్ట్ చేసి పక్కా ప్లాన్ ను అప్లై చేస్తున్నాడు హృతిక్ రోషన్. తారక్ కూడా దేవర షూటింగ్ ని 70% ఫినిష్ చేశాడు. అక్టోబర్‌లోపు దేవర ప్రాజెక్ట్ కి ఫుల్‌స్టాప్ పెట్టేయాలన్నది యంగ్ టైగర్ ప్లాన్. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ లో ఇద్దరు హీరోలతో వార్2 ఫస్ట్ షెడ్యూల్ మొదలవ్వుతుంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్స్ అంటే , కంపేరిజన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ నార్త్ వర్సెస్ సౌత్ అనే ట్రెండ్ నడుస్తున్న టైం లో వార్2 సెట్స్ పైకి వెళ్లడం కొత్త చర్చకు దారితీస్తోంది.
పట్టాలెక్కనున్న.. క్రిషి 4
వార్2 తర్వాత క్రిష్ 4 ని స్టార్ట్ చేసేలా కాల్ షిట్స్ ని కేటాయించాడు హృతిక్. ఇప్పటికే క్రిష్ కి సంబందించిన మెయిన్ ప్లాట్ సిద్ధం అయింది. షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు గ్రాఫిక్ వర్క్ పై ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ కరణ్ మల్హోత్రా. 2024 ద్వితీయార్థంలో క్రిష్ ని స్టార్ట్ చేసేలా ప్రణాళిక జరుగుతున్నాయి. మొత్తానికి వార్ సినిమా ఇచ్చిన బూస్ట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు హృతిక్. రెండేళ్లో మూడు సినిమాలు రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు.