Varun Tej: వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ.. దేశాన్ని కదిలించిన రియల్ స్టోరీ..!
ఓన్లీ కంటెంట్ బేస్డ్ స్టోరీస్‌ని సెలెక్ట్ చేసుకునే వరుణ్.. తాజాగా మరో కొత్త కథకు ఓటేశాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్లో నటించేందుకు ఎస్ చెప్పాడు. మట్కా టైటిల్‌తో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ మూవీ వరుణ్‌కి 14వ సినిమా.
Varun Tej: తన బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేదు. ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోడు. సక్సెస్ రేట్ ఎలా ఉన్నప్పటికీ కంటెంట్ ఉండే స్టోరీస్‌నే సెలెక్ట్ చేసుకుంటాడు. హి ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ.. మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న వరుణ్.. త్వరలో పాన్ ఇండియా మూవీతో వచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ రూటే సెపరేట్. తొలిమూవీ నుంచే డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వరుణ్.
SALAAR: సలార్ క్రేజ్.. దిమ్మతిరిగేలా బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
ఓన్లీ కంటెంట్ బేస్డ్ స్టోరీస్‌ని సెలెక్ట్ చేసుకునే వరుణ్.. తాజాగా మరో కొత్త కథకు ఓటేశాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్లో నటించేందుకు ఎస్ చెప్పాడు. మట్కా టైటిల్‌తో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ మూవీ వరుణ్‌కి 14వ సినిమా. పాన్ ఇండియా మూవీ కూడా. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తోన్న ఈ మూవీలో ఖిలాడీ బ్యూటీ మీనాక్షీ చౌదరి, బాహుబలిలో స్పెషల్ సాంగ్ చేసిన నోరాఫతేహీ హీరోయిన్స్. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే మట్కా మూవీపై రకరకాల రూమర్స్ వినిపించాయి. బడ్జెట్ ఎక్కువ అవడంతో పాటూ ఇలాంటి స్టోరీస్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనే డౌట్‌తో మూవీని పక్కనపెట్టేయాలని డిసైడ్ అయ్యారనే రూమర్స్ వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ మట్కాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుణ్. ‘మట్కా’ మూవీ స్టోరీ కల్పిత కథ కాదు. రియల్ స్టోరీ. ఈ విషయం టైటిల్ పోస్టర్ విడుదల చేసినప్పుడే చెప్పారు మేకర్స్. ‘మట్కా’ అనేది ఓ రకమైన జూదం. విశాఖ బ్యాక్ డ్రాప్‌లో 1958-1982 మధ్య స్టోరీ నడుస్తుంది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఇది. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు గెటప్‌లలో కనిపించనున్నాడు. వరుణ్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఇది.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చేశారు. 24 ఏళ్ల వ్యవధిలో అంటే 1958 –1982 మధ్య జరిగే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అప్పటి వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని క్రియేట్ చేసేందుకు ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తారట. మొత్తానికి పెళ్లి సందడిలో పడి చిన్న విరామం తీసుకున్న వరుణ్.. డిసెంబర్ నుంచి మళ్లీ షూటింగ్‌లో బిజీ కానున్నాడు. మరి మట్కాతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెడుతున్న వరుణ్ తేజ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుదాం.