Kareena Kapoor : ఏజ్ పెరుగుతున్న.. క్రేజ్ తగ్గని కరీనా
హీరోయిన్ ఎవరైనా.. ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ తగ్గుతుంది. 40 ప్లస్ లో చేరాక ఆఫర్స్ లో కోత పడుతుంది. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేటు అంటోంది ఓ బాలీవుడ్ బ్యూటీ.

Age increasing Kareena Kapoor craze does not decrease
హీరోయిన్ ఎవరైనా.. ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ తగ్గుతుంది. 40 ప్లస్ లో చేరాక ఆఫర్స్ లో కోత పడుతుంది. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేటు అంటోంది ఓ బాలీవుడ్ బ్యూటీ. ఏజ్ బార్ స్టేజ్ లో ఓటీటీ కమ్ బిగ్ స్క్రీన్ పై సత్తా చాటేందుకు సై అంటోందికరీనాకపూర్. జానే జాన్ మూవీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది కరీనా . ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ కథ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దృశ్యం చూసిన ఆడియన్స్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నా థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వారికి మాత్రం జానే జాన్ బెస్ట్ అప్షన్ గా మారింది.
జానే జాన్ లో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న కరీనా కపూర్ ఇప్పుడు సింగం అగైన్ షూటింగ్ లో జాయిన్ అయింది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో అజయ్ దేవగణ్ ,అక్షయ్ కుమార్,రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటిస్తూంటే దీపిక ,టైగర్ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ప్రజెంట్ అజయ్ , కరీనా పై లవ్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. తొమ్మిదేళ్ల తర్వాత అజయ్ తో కరీనా స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. మొత్తానికి ఏజ్ బార్ స్టేజ్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతునే క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది కరీనా కపూర్.