Agent Movie: చిరంజీవి క్లాస్ తీసుకుంటే తప్పు పట్టారు.. ఇప్పుడు చూడండి..
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో చెప్పాడు స్క్రిప్ట్ సరిగ్గాలేకుండా, సెట్లోకొచ్చి సీన్లు రాస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందన్నాడు. ఆచార్య ఫ్లాపైన తర్వాత కొరటాల శివ చేసిన తప్పులను, పరోక్షంగా కామెంంట్లతో కడిగేశాడు. అవే మాటలు ఇప్పుడు వందకోట్లు నష్టపోయిన ఏజెంట్ మూవీ నిర్మాత అనిల్ సుంకర అనేశాడు.
ఏజెంట్ ఫ్లాప్ కి కారణం కథ సిద్దం కాకముందే షూటింగ్ కి వెళ్లడమన్నాడు. సెట్లో కథలో మార్పులు చేయటం పెద్ద లోపమంటూ అదే శాపమైందన్నాడు. ఇవి ఇంచుమించు ఏడాది క్రితం చిరు అన్న మాటలే. ఎందుకంటే ఆచార్య మూవీ తో అటు నిర్మాతగా చెర్రీ, హీరోగా చిరంజీవి ఇద్దరూ నష్టపోయారు. కారణం కథలో క్లారిటీ లేక, సెట్లో కూర్చుని సీన్లు మార్చటం అన్నారు.
ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడాఅలాంటి తప్పులే చేసి 30 కోట్ల సినిమాను 80 కోట్ల బడ్జెట్ కి పెంచి నానా బీబత్ర్సం చేశాడట. అది మొదటి దెబ్బ అయితే, తలా తోకలేని కథతో ముందుకెళ్లటం రెండో తప్పు. ఇదే తప్పు లైగర్ తో పూరీ జగన్నాథ్ చేశాడు. నిర్మాత కూడా తనే కాబట్టి నష్టం కూడా తనే భరించాడనుకోవచ్చు. కాని పాపం తనని నమ్మిన రౌడీ స్టార్ అనవసరంగా ఇరుక్కున్నాడు. అడ్రస్ గల్లంతు చేసుకున్నాడు. సో ఏజెంట్ తో సూరీ, లైగర్ తో పూరీ, ఆచార్యతో కొరటాల శి ఇలా ఈ ముగ్గురు టాప్ డైరెక్టర్ అటు నిర్మాతల్ని, ఇటు స్టార్ హీరోలని మోసం చేశారనే కామెంట్లు పెరిగాయి. వాళ్ల అతి విశ్వాసమే వందలకోట్ల బడ్జెట్ కి శాపమైంది..