Nandamuri Balakrishna: అన్‌స్టాఫుబుల్ సీజన్ 4లో ట్విస్ట్.. ఏం పర్లేదు …

అన్ స్టాఫుబుల్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టైటిల్ విషయాన్ని మర్చిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది. అన్‌స్టాఫుబుల్ షో 2021లో స్టార్ట్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 02:02 PMLast Updated on: Apr 10, 2024 | 2:02 PM

Aha Ott Announces Unstoppable Season 4 With Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అనే పాట ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్‌గా సూటవుతుంది. వాళ్ళు బాలయ్య సినిమాకు సంబంధించి ఈ ఉగాదికి ఒక అప్‌డేట్ వస్తుంది అనుకున్నారు. కానీ, అది జరగలేదు. కానీ వాళ్ళ సంతోషం విషయంలో మాత్రం ఎలాంటి బ్రేక్ రాలేదు. ఒక రకంగా వాళ్ళు అనుకున్న దానికి మించే జరిగిందని చెప్పవచ్చు. ఇంతకీ వాళ్ళు ఏమనుకున్నారు? ఏమి జరిగింది? తెలుగు ప్రజలతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఈ ఉగాదిని చాలా ఘనంగా జరుపుకున్నారు.

PAVAN KALYAN : పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ గా ఉన్నాడా? ఎక్కడో తేడా కొడుతోంది !

అంతకంటే ముందు బాలయ్య నయా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పండుగ రోజు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూసారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టైటిల్ ప్రకటన వస్తుందనే ప్రచారం వచ్చింది. పైగా బాలయ్య సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉండి సినిమా రిలీజ్ అయ్యే దాకా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తాయి. దాంతో టైటిల్ ప్రకటన కోసం ఎదురు చూసారు. కానీ ఆ ప్లేస్‌లో ఇంకో గుడ్ న్యూస్ మాత్రం వాళ్ళు విన్నారు. అదేంటంటే అన్ స్టాఫుబుల్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టైటిల్ విషయాన్ని మర్చిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది. అన్‌స్టాఫుబుల్ షో 2021లో స్టార్ట్ అయ్యింది.

ఈ షో ద్వారా సరికొత్త బాలయ్య ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. సినీ, రాజకీయ రంగంలోని వాళ్ళని బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానానికి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఈ షో ద్వారా కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయారు. పైగా ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ షో టాక్ షో గా ఉందంటే అది కేవలం బాలయ్య వల్లనే. పోస్టర్‌లో ఆహా యాజమాన్యం విత్ ఎ ట్విస్ట్ అని చెప్పడంతో అందరిలో ఆ ట్విస్ట్ ఏంటనే క్యూరియాసిటీ ఏర్పడింది.