AI ని రే*** చేస్తున్నారుగా, స్టార్ హీరో సినిమాలో వాడేసారు

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏఐని దారుణంగా వాడుతున్నారు మేకర్స్. నటుల కోసం ఎదురు చూడకుండా డబ్బింగ్ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అలాగే ఈ టెక్నాలజీ సాయంతో కొన్ని పాటలు కూడా పాడేస్తున్నారు. ఇటీవల వార్తలు కూడా AI సాయంతోనే కొన్ని చానల్స్ చదవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 08:23 PMLast Updated on: Oct 14, 2024 | 8:23 PM

Ai Dubbing In Surya Kanguva Movie

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏఐని దారుణంగా వాడుతున్నారు మేకర్స్. నటుల కోసం ఎదురు చూడకుండా డబ్బింగ్ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అలాగే ఈ టెక్నాలజీ సాయంతో కొన్ని పాటలు కూడా పాడేస్తున్నారు. ఇటీవల వార్తలు కూడా AI సాయంతోనే కొన్ని చానల్స్ చదవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జస్ట్ వాయిస్ ఉంటే చాలు దాన్ని వాడుకుని మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసేస్తున్నారు. దీనిపై కాస్త విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో డబ్బింగ్ కోసం ఈ టెక్నాలజీ వాడారు.

అసలు వివరాల్లోకి వెళితే… తమిళ స్టార్ హీరో సూర్య… తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. కంగువ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమాపై చాలా ఆసక్తి ఉంది. సూర్య నటన విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా సబ్జెక్ట్ కొత్తది కాబట్టి కాస్త భయం కూడా ఉంది. అటు విలన్ గా బాలీవుడ్ స్టార్… బాబీ డియోల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఇటీవల ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమాపై జనాల్లో అక్కడి నుంచి మరింత పిచ్చి పెరిగింది. తెలుగులో కూడా సూర్యకి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా విషయంలో పక్కా లెక్కతో ఉన్నారు మేకర్స్. అందుకే ఇప్పుడు కంగువా సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగా చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది. తెలుగు హీరోలను కూడా ఆడియో లాంచ్ కి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో AI తో మ్యాజిక్ చేసారు మేకర్స్. వచ్చే నెల 14న ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ ని అసలు వాడలేదు చిత్ర యూనిట్. దర్శకుడు శివ ఆలోచన మేరకు డబ్బింగ్ కోసం AIని వాడారు. సూర్య వాయిస్ ని ప్రతీ భాషలో ఆ టెక్నాలజీ సాయంతో డబ్బింగ్ చేసింది చిత్ర యూనిట్. ఈ నెల 20న జరిగే ఆడియో లాంచ్ లో విడుదల చేయబోయే ట్రైలర్స్ అన్నీ కూడా అలా డబ్బింగ్ చెప్పినవే కావడం విశేషం. ఓ స్టార్ హీరో వాయిస్ ని అలా డబ్బింగ్ చేయడం కొత్త ప్రయోగం కావడంతో ఫ్యాన్స్ లో కాస్త భయం మొదలైంది.