TRISHA KRISHNAN: త్రిష మీద పడ్డారేంటి.. ఎన్ని సార్లు.. ఇంత చీప్‌గా..?
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో అతిలోక సుందరిగా కనిపించబోతోంది. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‌లో కూడా తనే హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అలా.. ఇంకా సౌత్‌ని ఏలుతున్న తనని మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు కొందరు నటులు, ఇంకొందరు రాజకీయ నాయకులు.
TRISHA KRISHNAN: త్రిష నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా టాలీవుడ్, కోలీవుడ్‌ని ఏలుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మూవీ విశ్వంభరలో అతిలోక సుందరిగా కనిపించబోతోంది. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‌లో కూడా తనే హీరోయిన్‌గా కన్ఫామ్ అయ్యింది. అలా.. ఇంకా సౌత్‌ని ఏలుతున్న తనని మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు కొందరు నటులు, ఇంకొందరు రాజకీయ నాయకులు. తమిళనాడు పార్టీ డీఎంకే నాయకుడు త్రిష.. 25 లక్షలు తీసుకుని, ఓ నాయకుడి రిసార్ట్‌కి వెళ్లిందనే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేశాడు.
Nikhil Siddhartha: మెమొరబుల్ మూమెంట్.. తండ్రైన హీరో నిఖిల్.. కొడుకుకి తొలిముద్దు..!
ఇప్పుడా వీడియో వైరలైంది. అంతే వెంటనే డీఎంకే నాయకత్వం అతన్ని తమ పార్టీనుంచి తొలగించింది. త్రిష కూడా జనాల్లో హైలెట్ అయ్యేందుకు కొందరు దిగజారే తీరు చూస్తే అసహ్యం వేస్తోందంటూ, తన లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందని తేల్చింది. ఇక తమిళ నటుడు విశాల్ అయితే త్రిష మీద ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి నరకంలో బాధింపడబతాడని, అసలు తన ఇంట్లో లేడీస్ ఇతన్ని ఇంట్లోకి కూడా రానివ్వరనేలా ఘాటుగా స్పందించాడు. ఆమద్య తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా త్రిషని ఇబ్బందిపెట్టే సీన్ చేస్తాననుకుంటే తనని చూసే అవకాశమే రాలేదంటూ లియో షూటింగ్ గురించి కామెంట్స్ చేశాడు. అది వివాదం అవ్వటంతో కోర్టు తనకి మొట్టికాయలు వేసింది.
ఈ వివాదం ముగిసింది అనకునేలోపే.. ఇప్పుడు ఒక పొలిటీషియన్ త్రిషని టార్గెట్ చేసుకున్నాడు. తను మన్సూర్ విషయంలో సాఫ్ట్‌గా రియాక్ట్ అయ్యిందనే.. ఇలా త్రిషని ఈజీ టార్గెట్‌గా మార్చుకున్నారంటున్నారు. అయితే త్రిష మాత్రం డీఎంకే నేత మీద లీగల్‌గా అప్రోచ్ అవటంతో సాఫ్ట్‌గా రియాక్ట్ కావట్లేదు. కాస్త గట్టిగానే యాక్షన్ కోసం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.