Aishwarya Rai Bachchan : జస్ట్ సెల్ఫీ తో నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్..
బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ఐశ్వర్య రాయ్(Aishwarya Ram), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) విడాకులు (Divorce) తీసుకుంటున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ప్రస్తుతం వీరి విడాకులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ రూమర్లకు తనదైన స్టైల్ లో చెక్ పెట్టింది ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది తన అందం. మిస్ ఇండియా (Miss India) తరువాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి జీన్స్ (Jeans) అనే సినిమాతో వెండితెరపై మెరిసి కోట్లాది గుండెలను కొల్లగొట్టింది. ఆ తరువాత వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫేం సంపాదించుకుంది. ఆ తరువాత అమితాబ్‌బచ్చన్ ఇంటి కోడలైంది. అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకొని ఏప్రిల్ 20 కి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వారి పెళ్లి రోజు సందర్భంగా బచ్చన్ ఫ్యామిలీ వేడుక చేసుకుంది. వీరి సుదీర్ఘప్రేమ ప్రయాణానికి గారాల కూతురు ఆరాద్యబచ్చన్ తోడైంది. ఈ వేడుకలో వీరు ముగ్గురు ఓ సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని అభిమానులతో పంచుకుంది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్లో విషెస్ చెప్తున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం ఈ స్టార్ కపుల్ విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తరువాత దాన్ని ఇద్దరు కొట్టిపడేశారు. ఇన్నాళ్లు యాడ్స్, షోలు, సోషల్ మీడియాకే పరిమితం అయిన ఐశ్వర్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఎప్పటికి వన్నెతగ్గని తన సొగసుతో మళ్లీ వెండితెరపై మాయ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కి ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో సైతం నటించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన అయితే లేదు.