గాసిప్ బ్యాచ్ కు ఐశ్వర్యరాయ్ స్లిప్పర్ షాట్, మొగుడిపై లవ్ పోస్ట్..

సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయంలో జనాలకు ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలిస్తే చాలు దాని గురించి హడావిడి చేస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 06:15 PMLast Updated on: Feb 07, 2025 | 6:15 PM

Aishwarya Rais Slipper Shot To The Gossip Batch Love Post On Husband

సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయంలో జనాలకు ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలిస్తే చాలు దాని గురించి హడావిడి చేస్తారు. లేదంటే అసలు వాళ్ళిద్దరూ కలిసి నవ్వుతూ కనపడిన సరే… వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ, దాని గురించి సోషల్ మీడియాలో చేసే ప్రచారం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక దానికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా తానా అంటే తందానా అన్నట్లు బిహేవ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్.. ఆయన భార్య ఐశ్వర్యరాయ్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది.

వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అంటూ జనాలు హడావిడి చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఏ విషయం క్లారిటీ లేకపోయినా, జనాలు మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ సపరేట్ గా ఉంటున్నారని, వేరువేరు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు అని… ఐశ్వర్యారాయ్ ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుంటుందని, అలాగే అభిషేక్ బచ్చన్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడని, సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వాళ్ళిద్దరూ ఇప్పటికే దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.

తాము ఇద్దరం అసలు విడిపోవడం లేదని పలుమార్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక లేటెస్ట్ గా అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అభిషేక్ బచ్చన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని… ఆయన జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని, ఆకాంక్షిస్తూ ఐశ్వర్య పోస్ట్ రాసుకొచ్చింది. ఇక రీసెంట్ గా అభిషేక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్యారాయ్ ని ఆకాశానికి ఎత్తేసాడు. తన సినిమా కెరియర్ బాగుంది అంటే కారణం ఐశ్వర్యరాయ్ అన్నాడు.

ఆమె కారణంగానే తాను సినిమాలను ఫ్యామిలీని మెయింటైన్ చేయగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గత ఏడాది అనంత్ అంబాని, రాధిక మర్చంట్ వివాహం జరగగా వీళ్ళిద్దరూ జంటగా కనిపించారు. ఇద్దరు విడివిడిగా కొన్ని వేడుకల్లో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అంతకుముందు వాళ్ళ కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో అభిషేక్ కనపడకపోవడంతో డైవర్స్ తీసుకోవడం ఖరారు అయిపోయిందని ప్రచారం జరిగింది.

ఇక లాస్ట్ ఇయర్ ఒక పార్టీలో ఫ్రెండ్స్ తో కలిసి వీళ్లిద్దరూ సెల్ఫీలు కూడా దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్య తో పాటుగా ఐశ్వర్యరాయ్ తల్లి కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల పరంగా అభిషేక్ కాస్త స్పీడ్ గానే ఉన్నాడు. ఐశ్వర్యరాయ్ మాత్రం సినిమాల విషయంలో కాస్త స్లోగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మణిరత్నం తెరకెక్కించిన ఒక సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత పెద్దగా సినిమాలపై ఫోకస్ పెట్టలేదు.