500 కోసం ఐశ్వర్య రాజేష్ 11 గంటలు, కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ఐశ్వర్య రాజేష్... తెలుగు అమ్మాయి అయినా సరే ఇక్కడ మంచి అవకాశాలు లేక తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు కొట్టేసి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది.
ఐశ్వర్య రాజేష్… తెలుగు అమ్మాయి అయినా సరే ఇక్కడ మంచి అవకాశాలు లేక తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు కొట్టేసి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది. నటనపరంగా చాలామంది స్టార్ హీరోయిన్ల కంటే ఈ హీరోయిన్ చాలా బెటర్ అనేది ఆమె యాక్టింగ్ చూస్తే అర్థమవుతుంది. అలాగే గ్లామర్ రోల్స్ కు పెద్దగా ఆమెకి సూట్ కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాల్లో మాత్రం ఆమె కచ్చితంగా మంచి పాత్రలు చేయగలరు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది.
అయితే ఆమె గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ముఖ్యంగా ఆమె తండ్రి రాజేష్ తెలుగులో గొప్ప నటుడు. ఒకప్పుడు స్టార్ హీరో కూడా ఆమె తండ్రి రాజేష్. తెలుగులో మల్లెమొగ్గలు, రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మంచి యాక్టర్ గా ఆయనకు గుర్తింపు ఉంది. ఇక ఐశ్వర్య రాజేష్ తాతయ్య అమర్నాథ్ కూడా యాక్టింగ్ లో మంచి నటుడు. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీ లక్ష్మీ హాస్యనటిగా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
అప్పట్లో ఐశ్వర్య రాజేష్ తండ్రి హైదరాబాదు నుంచి చెన్నై వెళ్లిపోయారు. అప్పటినుంచి ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే ఉంటుంది. ఐశ్వర్య తండ్రి హీరోగా నటిస్తున్నప్పటినుంచి ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందట. రాజేష్ ఒక సినిమాలో నటించిన వచ్చిన డబ్బులను దానధర్మాలకు ఇవ్వాల్సి వచ్చేదట. ఎవరో ఒకరు వచ్చేసి రాజేష్ ను డబ్బులు ఇవ్వమని అడగడంతో వచ్చిన వారిని కాదనలేక రాజేష్ సహాయం చేసే వారట. ఆమె తల్లి కూడా మంచి వ్యక్తి కావడంతో దానధర్మాలు చేసే వారట.
లక్షల రూపాయలకు షూరిటీ ఉండి కూడా ఐశ్వర్య తల్లిదండ్రులు ఇతరులకు డబ్బులు ఇప్పించేవారు. ఇలా ఆలోచించకుండా అందరికీ సహాయం చేసి ఉన్న కొద్ది డబ్బులు పోగొట్టుకున్నారు. అలాగే తాగుడుకు అలవాటైన రాజేష్ తన ఆరోగ్యం మొత్తం నాశనం చేసుకున్నారట. దాంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు ముగ్గురు అమ్మాయిలను పెంచడానికి ఎల్ఐసి ఏజెంట్ గా పని చేశారు. ఐశ్వర్య తల్లి ఆర్థిక భారంతో మానసికంగా మరియు శారీరకంగా కృంగిపోయిన తన భర్తను బతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యమే చేయించారట. కానీ చివరకు రాజేష్ లివర్ చెడిపోవడంతో చనిపోయారు. తండ్రి చనిపోయిన సమయంలో ఐశ్వర్య రాజేష్ కు కేవలం ఎనిమిదేళ్ళు. ఆ టైం లో వారికి ఒకటే ఫ్లాట్ ఉంది. ఇక షూరిటీ కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ అప్పును చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్ళు ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారట. దీంతో కుటుంబం మొత్తం అదే ఇంట్లో తలదాచుకున్నారు.
ఆ తర్వాత ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఐశ్వర్య రాజేష్ సినిమాల్లోకి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఐశ్వర్య ఇద్దరు అన్నలు ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం ఐశ్వర్య రాజేష్ మీద పడటంతో ఆమె సీరియల్స్ లో నటించడానికి రెడీ అయ్యారు. సీరియల్లో రోజుకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 వరకు నటించారు. అందుకు గాను ఆమెకు 500 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఇల్లు గడవడానికి ఆ డబ్బులు సరిపోక సినిమాల్లో అయితే మంచి సంపాదన వస్తుందని ఐశ్వర్య సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కలర్ బాగాలేదని భాష బాగాలేదని చాలామంది అవమానించిన ఏమాత్రం పట్టించుకోకుండా చివరకు హీరోయిన్ గా అడుగుపెట్టింది.