గ్రీక్ గాడ్ తో ఐశ్వర్య పెళ్లి…? సిగ్నల్స్ స్ట్రాంగ్ గా…?

బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో విడాకుల వ్యవహారాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు విడిపోతారో అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇక చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో జనాల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 02:26 PMLast Updated on: Oct 25, 2024 | 2:26 PM

Aishwaryas Wedding With Greek God Signals Strong

బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో విడాకుల వ్యవహారాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు విడిపోతారో అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇక చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో జనాల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమా వాళ్ళ జీవితాల గురించి ఏ చిన్న వార్త వచ్చినా వాళ్ళను రోడ్ మీదకు లాగే వరకు వదిలే ఛాన్స్ ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోలు హీరోయిన్ల లైఫ్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. చిన్న రూమర్ వచ్చినా ఇక వాళ్ళు డైవర్స్ తీసుకునే వరకు వదిలే ప్రసక్తే లేదన్నట్టు ఉంది.

ప్రస్తుతం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువగా షికారు చేస్తున్నాయి. ఐశ్వర్య రాయ్… అభిషేక్ కు విడాకులు ఇచ్చి… తన చిన్ననాటి స్నేహితుడు, డాక్టర్ ఒకరిని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఇక అభిషేక్ లేకుండానే ఐశ్వర్య రాయ్ ఈ మద్య కాలంలో వరుస టూర్ లకు కూడా వెళ్తున్నారు. ఆ టూర్స్ లో అసలు అభిషేక్ కనపడటం లేదు. దీనితో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అనే వార్తలు మొదలయ్యాయి. ఇక ఐశ్వర్య రాయ్ ఇటీవల దీనిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చింది.

కొన్ని నెలల క్రితం ఐశ్వర్య తన భర్తకి బర్త్ డే విషెస్ లేట్ గా చెప్పడంతో విడాకుల రూమర్స్ పీక్స్ కు వెళ్ళాయి. ఆరాధ్య స్కూల్ ఈవెంట్, అమితాబ్ బర్త్ డే సందర్భంగా ఐష్ ఈ వార్తలకు ముగింపు పలికినా ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. రీసెంట్ గా ఓ సిచ్యుయేషన్ తో రూమర్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒక ఈవెంట్‌కి అటెండ్ కాగా ఆ ఈవెంట్ లో అసలు అభిషేక్ కనపడలేదు. దీనితో అసలు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు ఫ్యాన్స్ కి. అయితే ఇప్పుడు ఓ గాసిప్ షాక్ చేస్తోంది.

ఐశ్వర్య రాయ్, హ్రితిక్ రోషన్ వివాహం చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలయింది. హ్రితిక్ రోషన్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భార్యకు మాత్రం అంత దూరంగా కనపడలేదు. పిల్లల కోసం మాత్రమే అప్పుడప్పుడు కలుస్తున్నారనే వార్త ఒకటి వచ్చింది. ఇప్పుడు ఐశ్వర్య కూడా అభిషేక్ కి దూరంగా ఉంది. దీనితో ఇద్దరూ వివాహం చేసుకుంటారని, అభిషేక్ కు దూరమైన తర్వాత హ్రితిక్ కు దగ్గరైంది అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.