RC 15: క్రేజీ కాంబినేషన్‌.. RC15లో స్టార్‌ హీరో

శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ నటిస్తున్న తరువాతి ప్రాజెక్ట్‌ గురించి ఇలాంటిదే ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో స్టార్‌ హీరో అజిత్‌ గెస్ట్‌ రోల్‌ ప్లే చేయనున్నట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 05:01 PMLast Updated on: Mar 09, 2023 | 5:01 PM

Aith Playing A Guesr Role In Ram Charan And Shankar Movie

RRR సినిమా తరువాత రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. చరణ్‌ చేసే ప్రతీ ప్రాజెక్ట్‌ మీద ఇప్పుడు ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. చెర్రీ సినిమా నుంచి వచ్చే చిన్న అప్‌డేట్‌ కూడా క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతోంది. అలాంటిది ఓ పెద్ద అప్‌డేట్‌ వస్తే ? ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.

శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ నటిస్తున్న తరువాతి ప్రాజెక్ట్‌ గురించి ఇలాంటిదే ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో స్టార్‌ హీరో అజిత్‌ గెస్ట్‌ రోల్‌ ప్లే చేయనున్నట్టు తెలుస్తోంది. చరణ్‌ ఫ్రెండ్‌ పాత్రలో సినిమా మధ్యలో అజిత్‌ ఎంట్రీ ఉండనున్నట్టు సమాచారం. కొంచెం సమయం మాత్రమే ఉండే ఈ రోల్‌ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. కోలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

స్టార్‌ హీరోలు గెస్ట్‌ రోల్స్‌లో కనిపించడం ఈ మధ్య కామన్‌గా మారిపోయింది. డైరెక్టర్లు తమ ముందు సినిమాలోని హీరోతో.. తరువాత ప్రాజెక్ట్‌లో గెస్ట్‌ రోల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటీ అంటే. అజిత్‌, శంకర్‌ కలిసి ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ శంకర్‌ అజిత్‌తో గెస్ట్‌ రోల్‌ చేయిస్తున్నారంటూ వార్తలు మాత్రం వస్తున్నాయి. సినిమాలు చేయకపోయినా ముందు నుంచీ అజిత్‌, శంకర్‌ మధ్య మంచి కమ్యూనికేషన్‌ ఉంటుంది. దీని కారణంగానే గెస్ట్‌ రోల్‌ చేయిస్తున్నారంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది సీనియర్‌ యాక్టర్స్‌, స్టార్‌ యాక్టర్స్‌ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు అజిత్‌ కూడా కనిపింబోతున్నాడని తెలియడంతో అటు అజిత్‌ ఇటు చెర్రీ ఫ్యాన్స్‌లో జోష్‌ రెట్టింపైంది. అయితే దీనిపై శంకర్‌ అండ్‌ కో.. ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తారో చూడాలి.