Ajay Devgn: బాలీవుడ్ హీరోని భయపెట్టిన పుష్ప రాజ్..!
పుష్ప 2 రంగంలోకి దిగుతున్నాడని తెలిసి, పోటీ వద్దనే సైడ్ ఇచ్చాడట హీరో అజయ్ దేవ్‌గణ్. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.. తెలుగు సినిమాకు బాలీవుడ్ ఎంతగా భయపడుతుందో చెప్పడానికి. పుష్ప 2 అసలే మాస్ మూవీ. దీనికి తోడు హిట్ సినిమాకు సీక్వెల్. సో ఇది కూడా హిట్ అవటం కన్ఫామ్.

Ajay Devgn: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్. ఆ విషయాన్ని బాలీవు్డ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఒప్పేసుకున్నాడు. తన హిట్ మూవీ సింగం సీక్వెల్‌తో వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి రావాల్సిన తను, ఆ డేట్ వద్దని దసరాకి వాయిదా వేసుకున్నాడు. కారణం పుష్పనే. ఈ సినిమా సీక్వెల్ ఆగస్ట్ 15న రాబోతోంది. కాని అదే రోజున అజయ్ దేవ్‌గణ్ సింగం ఎగైన్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే పుష్ప 2 రంగంలోకి దిగుతున్నాడని తెలిసి, పోటీ వద్దనే సైడ్ ఇచ్చాడట హీరో అజయ్ దేవ్‌గణ్.
ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.. తెలుగు సినిమాకు బాలీవుడ్ ఎంతగా భయపడుతుందో చెప్పడానికి. పుష్ప 2 అసలే మాస్ మూవీ. దీనికి తోడు హిట్ సినిమాకు సీక్వెల్. సో ఇది కూడా హిట్ అవటం కన్ఫామ్. అది తెలిసే.. చూసి చూసి ఎందుకు పోటీ పడాలని అజయ్ దేవ్‌గణ్ వెనకడుగు వేశాడు. ఏదేమైనా సింగం ఎగైన్ టీం నిర్ణయంతో పుష్ప 2 రేంజ్ ఏంతో తెలిసిపోయింది. ఇక బన్నీ ఫ్యూచర్ ప్లానింగ్ చూస్తే.. బాలీవుడే కాదు టాలీవుడ్ స్టార్స్ కూడా భయపడాల్సి వస్తోంది. ఒక వైపు సందీప్ రెడ్డి వంగతో మూవీ, మరో వైపు లోకేష్, ఆట్లీ, త్రివిక్రమ్, బోయపాటి సినిమాలు.. ఇలా అన్నీ పైప్‌లైన్‌లో పెట్టాడు బన్నీ. వచ్చే ఏడాది జూన్ నుంచి మార్చ్ వరకు ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ తీసే సందీప్ రెడ్డి వంగా, 2025 జనవరిలో బన్నీ సినిమాను లాంచ్ చేస్తాడట.
ఇది 2026 ఆగస్టు 15కి రానుందని, ఇక 2025 సమ్మర్‌లో లోకేష్ మూవీ పట్టాలెక్కి 2026 దీపావళికి వస్తుందని తెలుస్తోంది. సో.. పుష్ప 2తో 2024 ఆగస్ట్, త్రివిక్రమ్, ఆట్లీ, బోయపాటి సినిమాలతో 2025లో సందడి చేయనున్న బన్నీ.. ఆతర్వాతే సందీప్, లోకేష్ మూవీలతో పాన్ ఇండియా ప్రయోగాలతో వస్తాడు. వాటినే సేఫ్ జోన్‌లుగా పెట్టుకున్నాడు.