Ajay Devgn: వరల్డ్‌ రికార్డ్‌.. ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌కు ఓకే..

ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, స్టార్‌ హీరోల పాత సినిమాలకు సెకండ్‌ పార్ట్‌ లు రావడం అనేది చాలా కామన్‌ అయ్యింది. ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ క్రేజీ ఫీట్‌ చేయబోతున్నాడు. ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 12:04 PMLast Updated on: Apr 04, 2024 | 12:04 PM

Ajay Devgn Is Readying For Sequels Of His 8 Movies

Ajay Devgn: ప్రస్తుతం అన్ని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, స్టార్‌ హీరోల పాత సినిమాలకు సెకండ్‌ పార్ట్‌ లు రావడం అనేది చాలా కామన్‌ అయ్యింది. ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ క్రేజీ ఫీట్‌ చేయబోతున్నాడు. ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

Rashmika-Vijay: నేషనల్ క్రష్‌కి రౌడీ బాయ్‌ గ్రాండ్ పార్టీ.. దుబాయ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ షురూ..!

దీంతో.. తమ హీరో సీక్వెల్స్‌తో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడంటూ అజయ్ దేవగన్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. అజయ్ దేవగన్ ఇటీవలే రైడ్ 2 సినిమాను మొదలు పెట్టాడు. త్వరలో దేదే ప్యార్ దే సినిమా సీక్వెల్‌‌ను కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక 12 ఏళ్ల కిందట వచ్చిన సన్నాఫ్ సర్దార్‌ సినిమాకి కూడా సీక్వెల్‌ ను చేసే పనిలో మేకర్స్ ఉన్నారని సమాచారం తెలుస్తోంది. ఇంకా అవి కాకుండా దృశ్యం సీక్వెల్‌‌కి కూడా అజయ్‌ దేవగన్ రెడీ అవుతున్నాడు. ధమాల్‌ 4, గోల్‌‌మాల్‌ 5 సినిమాలు ఇప్పటికే సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ఇటీవల విడుదల అయిన షైతాన్‌కి కూడా సీక్వెల్‌‌ను మేకర్స్ ప్రకటించారు. ఇవే కాకుండా.. ఇంకా మరో రెండు మూడు సీక్వెల్స్ కూడా చర్చల దశలో ఉన్నాయని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలా ఒక్క హీరో ఇన్ని సీక్వెల్వ్ ను లైన్‌లో పెట్టడం మాత్రం కచ్చితంగా వరల్డ్ రికార్డే అన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కాగా.. ఈ ఏడాది ‘సైతాన్‌’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ దేవగన్ త్వరలోనే ‘మైదాన్‌’ తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

దీని తర్వాత ఆయన నటించే చిత్రాలన్నీ దాదాపు సీక్వెల్సే కానున్నాయి. ఎందుకంటే. ఈ మధ్య కాలంలో అజయ్ దేవగన్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సందడి చేయడంలో విఫలం అవుతున్నాయి. దీంతో.. దేవగన్ సీక్వెల్స్‌పై ఫోకస్ పెట్టారంటున్నారు. ఈ 8 సీక్వెల్స్ కచ్చితంగా ఆయనకు హిట్స్‌ తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలకు గనక ఈ సీక్వెల్స్‌కు పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. పైగా ఆ సినిమాలకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అవుతుంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎనిమిది సీక్వెల్స్‌తో అజయ్ దేవగన్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.