శివరాత్రికి బాలయ్య ఫ్యాన్స్ జాగారమే.. అఖండ 2 క్రేజీ అప్డేట్ రెడీ

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమా అనగానే మాస్, క్లాస్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగింది. గతంలో కథల విషయంలో బాలయ్య పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 01:30 PMLast Updated on: Feb 04, 2025 | 1:30 PM

Akhanda 2 Crazy Update Ready

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమా అనగానే మాస్, క్లాస్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగింది. గతంలో కథల విషయంలో బాలయ్య పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. కానీ అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య రూట్ మార్చారు. కథ విషయంలో గతంలో చాలా తక్కువ టైం కేటాయించే బాలయ్య ఈసారి మాత్రం కథకు ఎక్కువ టైం కేటాయించి సినిమాను ఓకే చేస్తున్నారు. అందుకే సినిమాలు వరుసగా హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక రికార్డులు కూడా బాలయ్య బ్రేక్ చేస్తున్నారు.

కెరీర్ లోనే బాలయ్య ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్నారు. ఇక ఆయన చిన్న కుమార్తె తేజస్విని కూడా బాలయ్య సినిమాల కథలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. దీనితో బాలయ్య వరుసగా హిట్లు కొడుతూ యంగ్ హీరోలకు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సీక్వెల్ ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సీక్వెల్ కోసం మహా కుంభమేళా వద్దకు వెళ్లిన డైరెక్టర్ బోయపాటి శ్రీను అక్కడే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోచ్చారు.

ఇక త్వరలోనే మరి కొంత షూటింగ్ కూడా అక్కడ జరిగే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఆ తర్వాత విజయవాడ సమీపంలోని గుడిమెట్లలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే కృష్ణ నదిలో తిరిగి షూటింగ్ లొకేషన్స్ ను కూడా బోయపాటి ఫైనల్ చేశారు. త్వరలోనే అఖండ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఫాస్ట్ గా ఇవ్వాలని మేకర్స్ రెడీ అవుతున్నట్లు టాక్. జూన్ నాటికి ఎలాగైనా సరే బాలకృష్ణ పోర్షన్ కంప్లీట్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్లాలని బోయపాటి పట్టుదలగా ఉన్నాడు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన సీన్స్ మ్యూజిక్ కంప్లీట్ చేసేసాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టడంతో బోయపాటి ఎక్కడా లేట్ చేయడం లేదు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో మరింత ఎనర్జీతో బాలయ్య వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది అనేదానిపై క్లారిటీ రావటం లేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయినట్లు టాక్. అఖండ సీక్వెల్ ఫస్ట్ లుక్ ను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆల్రెడీ బాలయ్య బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ ను సిద్ధం చేయగా అది శివరాత్రి కానుక రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.