Akhil: అయ్యగారు నీకో దండం.. వద్దుబాబోయ్..

అక్కినేని అయ్యగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. రీసెంట్ గా ఏజెంట్ అని తడిసిన దీపావళి బాంబుల్లాంటి ఫైట్లతో షాక్ ఇచ్చాడు. సరే సినిమా పోయినా ఓటీటీలో సందడి చేస్తుందనుకుంటే, రైట్స్ తీసుకున్న డిజిటల్ సంస్థ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయట్లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2023 | 06:00 PMLast Updated on: May 30, 2023 | 6:00 PM

Akhil Agent Movie Ott Updates

థియేటర్స్ లో జనం చూడక, రైట్స్ కొన్న సంస్థ ఓటీటీలో వెయ్యక అయ్యగారి అద్భుత పెర్ఫామెన్స్ చూసే ఛాన్స్ ఎలా దొరుకుతుంది. ఇంతకి ఓటీటీ సంస్థ ఎందుకు అయ్యగారి ఏజెంట్ మూవీని టెలికాస్ట్ చేయట్లేదు.. ఈ ప్రశ్నలకే ఫన్నీ సమాధానం దొరుకుతోంది.

నిజానికి ఏజెంట్ మూవీ రైట్స్ సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ సంస్థ సోనీ లైవ్ కొనేసింది. కాని థియేటర్స్ లో రిలీజయ్యాక డిజాస్టర్ అయిన ఈ మూవీ, ఓటీటీలో వేస్తే చూస్తారా అనే డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి. అందుకే సోనీ లైవ్ కూడా ఏజెంట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తోందట. సరైన సమయం చూసి అంతా ఓకే అనుకుంటే కాని టెలికాస్ట్ చేయదట. కుదిరితే నిర్మాతతో డీల్ క్యాన్సల్ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అట్లుంటది అఖిల్ సినిమా దెబ్బంటే..