Agent Movie: పాపం ఏజెంట్‌.. ధృవతో లింక్‌ పెట్టినా హైప్‌ రావడం లేదే..

అయ్యగారు.. అయ్యగారే నంబర్‌ వన్‌. ఇదంతా పేరుకే.. అయ్యగారికి ఇప్పటికీ సరైన హిట్ పడింది లేదు. ఏజెంట్ మూవీ రిలీజ్ కోసం ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది టైమ్. అడ్వాన్స్‌ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే ప్రతీ థియేటర్‌లో ఖాళీ సీట్లే దర్శనం ఇస్తున్నాయ్. బుక్‌ చేసుకునేందుకు ఎవరూ ముందుకు వచ్చినట్లు కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2023 | 06:00 PMLast Updated on: Apr 27, 2023 | 6:00 PM

Akhil Agent Movie Promotions

రిజల్ట్‌ ఆధారంగా తర్వాత ప్లాన్ చేసుకుందాం లే అన్నట్లుగా కనిపిస్తున్నారు ఆడియెన్స్. నిజానికి అఖిల్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌ మూవీ ఇది. దాదాపు 70కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. దీనికితోడు మమ్ముట్టిలాంటి స్టార్స్ కూడా యాడ్ కావడంతో.. సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయ్‌. ఐనా సరే.. అడ్వాన్స్‌ బుకింగ్స్ చూస్తే మాత్రం పాపం అనిపిస్తోంది సీన్. పోనీ ప్రమోషన్ బాగోలేదా అంటే.. అలా కాదు. ప్రమోషన్‌కు చాలా కష్టపడుతున్నారు. ప్రిరిలీజ్ ఈవెంట్‌కు నాగార్జున వచ్చాడు. తన కొడుకుని ఆశీర్వదించాలని వేడుకున్నాడు.

సముద్రంలో ఒకసారి.. గన్నుల మధ్య ఇంకోసారి.. ఇలా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలను కొత్తగా ప్లాన్ చేసింది మూవీ టీం. ఐనా సరే ఫలితం లేకుండా పోయింది. ధృవకు, ఏజెంట్‌కు లింక్‌ పెట్టినా సరే.. ఫలితం లేదు. ఏజెంట్ మూవీ కోసం గ్లోబల్‌స్టార్ రాంచరణ్‌ కూడా సపోర్టుగా నిలిచాడు. ఏజెంట్‌కు ధృవలాగా కాల్‌ చేసి.. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ.. చెప్తాడు. ప్రమోషనల్‌ టీజర్‌ బాగుంది కానీ.. ప్రమోషన్ మాత్రం రావడం లేదు. ఈ లెక్కలన్నీ చూసి.. ఏజెంట్‌కు షాక్ తగలడం ఖాయం అనిపిస్తోంది. పాపం అఖిల్‌.. ఈ మధ్య ఏది ముట్టుకున్నా మసే అన్నట్లు తయారవుతోంది పరిస్థితి.