Agent Review: ఆపరేషన్ ఫెయిల్.. ఏజెంట్‌తో మరో డిజాస్టర్!
చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఇస్తుందని అంతా అనుకున్నారు. సినిమా ప్రమోషన్స్, అఖిల్ లుక్ చూసి సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రతీ చోటా సినిమాకు నెగటివ్ టాక్ వినిపిస్తోంది.
Agent Review: ఆఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన ఏజెంట్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఇస్తుందని అంతా అనుకున్నారు. సినిమా ప్రమోషన్స్, అఖిల్ లుక్ చూసి సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రతీ చోటా సినిమాకు నెగటివ్ టాక్ వినిపిస్తోంది.
ఇక కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్. మమ్ముట్టి సలహాతో ఓ ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఆపరేషన్‌లో అఖిల్‌కు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేశాడు, చివరికి విలన్స్‌ను ఎలా ఓడించాడు అనేది కథాశం. ఈ లైన్‌తో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నా.. ఎట్‌లీస్ట్ వాటిని కూడా ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. రొటీన్ కథను మరింత బోర్‌గా తీశారు. అఖిల్, మమ్ముట్టి మినహాయిస్తే ఎవ్వరూ వాళ్ల పాత్రకు న్యాయం చేయలేదు. ఇక హీరోయిన్ లిప్ సింక్ కూడా చాలా సార్లు మిస్ అయ్యింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో కనీసం లిప్ సింక్ కూడా చూసుకోలేదు అంటే సినిమాను ఎంత నెగ్లెక్ట్‌గా తీశారో అర్థం చేసుకోవచ్చు. ఇక బీజీఎం, మ్యూజిక్ ఈ సినిమాకు మరో మైనస్. చాలా బీజీఎమ్స్.. సీన్‌కు సంబంధం లేకుండా వచ్చాయి. నిజానికి ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అవుతుంది.
కానీ ఈ సినిమాకు మాత్రం మ్యూజిక్ మైనస్‌గా మారింది. యాక్షన్ సీక్వెన్స్ తప్పితే మిగతా స్టోరీ ప్రేక్షకులను ఆకట్టకోలేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్. విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ తప్పితే ఫస్ట్ హాఫ్‌లో పెద్ద థ్రిల్లింగ్ సీన్స్ ఏవీ లేవు. సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీన్స్ తప్పితే మిగతా అంతా బోరింగ్‌గా ఉంది. ఇక క్లైమ్యాక్స్ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఏజెంట్‌ను గట్టెంక్కించలేకపోయింది. యాక్షన్ పరంగా అఖిల్‌కు మంచి మార్క్స్ పడ్డాయి. తన రోల్‌లో జీవించేశాడు అఖిల్. మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ అఖిల్‌కు మంచి స్టోరీ పడటంలేదంటున్నారు క్రిటిక్స్. ఇప్పటికే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్.. ఏజెంట్ సినిమాతో మరోసారి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.