Agent: అఖిల్ ఏజెంట్ బాలీవుడ్ పఠాన్‌లా పేలిందా? పొన్నియన్ సెల్వన్-2 మరో బాహుబలి-2 అయిందా?
ఏజెంట్ విషయానికొస్తే, సురేందర్ రెడ్డి కొండంత రాగం తీసి, ఖూనీ పాట పాడినట్టైందనంటున్నారు. ఎందుకంటే కథలేని పఠాన్ లాంటి బోరింగ్ మూవీనే ఏదో షారుఖ్ కోసం చూశారు. అలాంటిది ఇప్పుడు పఠాన్‌కి వరస్ట్ వెర్షన్ ఏజెంట్ అంటున్నారు ఆడియెన్స్.
Agent: అఖిల్ నటించిన ఏజెంట్ పాన్ ఇండియా మూవీ అన్నారు. పొన్నియన్ సెల్వన్-2 మూవీని మరో బాహుబలి-2 అన్నారు. కానీ ఈ రెండు సినిమాలు రిలీజయ్యాకే వాస్తవం ఏంటో అర్థమైంది. ఏజెంట్ విషయానికొస్తే, సురేందర్ రెడ్డి కొండంత రాగం తీసి, ఖూనీ పాట పాడినట్టైందనంటున్నారు. ఎందుకంటే కథలేని పఠాన్ లాంటి బోరింగ్ మూవీనే ఏదో షారుఖ్ కోసం చూశారు.
అలాంటిది ఇప్పుడు పఠాన్‌కి వరస్ట్ వెర్షన్ ఏజెంట్ అంటున్నారు ఆడియెన్స్. మరి ఈ మూవీని నమ్ముకుని ప్రొడ్యూసర్ ఎలా రూ.80 కోట్లు పెట్టాడనే ప్రశ్న ఎదురవుతోంది ఫిలిం సర్కిల్‌లో. అసలే అఖిల్‌కి మార్కెట్ లేదు. సక్సెస్ రేటు పెరగట్లేదు. యాక్టింగ్ విషయానికొస్తే డాన్స్‌తో పోలిస్తే కిలోమీటర్ దూరం తను. దీనికి తోడు సినిమా స్టోరీ లైన్ బాగున్నా.. కథనం మాత్రం సున్నా అనిపించుకునేలా ఉంది స్క్రిప్ట్. ఇన్ని వంకులున్న ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఒకటీ! ఆపాటలో మెరిసిన ఊర్వశీ రౌతేలా ధరించిన ఒక్కో డ్రెస్సుకి రూ.20 లక్షల ఖర్చు.
ఇలా మనీని మంచి నీళ్లలా ఖర్చుచేసి, పాన్ ఇండియా మూవీ అంటే అయిపోతుందా? ప్చ్.. వీరి కష్టానికి కనీసం యావరేజ్ టాక్ కూడా రావట్లేదు. ఇక పొన్నియన్ సెల్వన్-2 విషయానికొస్తే.. అదే కథ, అదే వ్యథ, అదే టేకింగ్, అదే మేకింగ్. పార్ట్-1తో పోలిస్తే పార్ట్-2లో క్లారిటీ వస్తుందనుకున్నారు. కాని ఏమైంది..! అదే ఔట్ డేటెడ్ కవితాత్మక నెరేషన్ కొంపముంచింది. రెండో ఐశ్వర్య ట్విస్ట్ పేలుతుందనుకుంటే, తూలేలా చేసింది. రెహమాన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఛమక్కులు తప్పితే పొన్నియన్ సెల్వన్-2లో థియేటర్‌కి వెళ్లి చూసేంత సరకు లేదనే కామెంట్స్ పెరిగాయి.