అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి.. భారీ ప్లాన్ వేస్తున్న అయ్యగారు..
అక్కినేని అభిమానులకు పెద్దగా కోరికలు లేవు. వాళ్లు ఇండస్ట్రీ హిట్లు రావాలని కోరుకోవడం లేదు. వాళ్లకు చాలా చిన్నచిన్న కోరికలు ఉన్నాయి.

అక్కినేని అభిమానులకు పెద్దగా కోరికలు లేవు. వాళ్లు ఇండస్ట్రీ హిట్లు రావాలని కోరుకోవడం లేదు. వాళ్లకు చాలా చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య వాటిని ఫుల్ ఫిల్ చేస్తున్నారు. కానీ ఆశలు పెట్టుకున్న అఖిల్ అక్కినేని మాత్రం ఇప్పటి వరకు ఒక హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఇదొక్కటే అక్కినేని ఫ్యాన్స్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. నిజానికి అఖిల్ చాలా పెద్ద మాస్ హీరో అవుతాడు అని ముందు నుంచి కలలు కన్నారు వాళ్ళు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా అఖిల్ లుక్స్ చూసిన తర్వాత అక్కినేని కుటుంబంలో మొదటి మాస్ హీరో ఇతడే అని ఫిక్స్ అయిపోయారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వరుసగా మూడు ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయిన అక్కినేని వారసుడు.. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కాస్త పర్లేదు అనిపించాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కొంతలో కొంత బెటర్. కానీ ఆ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా పోయింది. ఇదిలా ఉంటే ఎప్రిల్ 8న అక్కినేని అఖిల్ పుట్టిన రోజు. ఏడాది వయసులోనే సిసింద్రీ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ కొట్టాడు అఖిల్. తర్వాత కొన్నేళ్ల పాటు చదువుతో బిజీ అయిపోయి 2015లో అఖిల్ అంటూ హీరోగా వచ్చాడు. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అఖిల్ అంచనాలు నిలబెట్టలేదు. ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్కినేని కుటుంబంలో తొలి మాస్ హీరో అయ్యే లక్షణాలు కేవలం అఖిల్ కు ఒక్కడికే ఉన్నాయని అభిమానులు ఇప్పటికీ నమ్ముతున్నారు.
దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం అఖిల్ మీదే ఉంది. ఇప్పటి వరకు హిట్ కొట్టకపోయినా కూడా కచ్చితంగా కొట్టిన రోజు మాత్రం అఖిల్ స్టార్ అవుతాడని నమ్ముతున్నారు వాళ్లు. కాస్త లేట్ అయినా కూడా వందశాతం బాక్సాఫీస్ ను కుమ్మేస్తాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టే మురళీ కిషోర్ సినిమా ఫుల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. దీని తర్వాత యూవీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడు తో పెద్ద సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. దీనికోసం రాజమౌళి కూడా స్క్రిప్ట్ వర్క్ లో హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి చూడాలిక.. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అఖిల్ ఎప్పుడు నెరవేరుస్తాడో..? అన్నట్లు అఖిల్ కు ఇండస్ట్రీ నుంచి చాలా మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.