AGENT: ఏజెంట్‌కు ఏడాది.. ఓటీటీ రిలీజ్ ఏది..? టీవీలో వచ్చేదెప్పుడు..?

అఖిల్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2024 | 06:32 PMLast Updated on: Apr 28, 2024 | 6:32 PM

Akkineni Akhils Agent Completed One Year But Not Released In Ott Yet

AGENT: ఓటీటీలో విడుదల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఏజెంట్. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం ఏజెంట్ చిత్రం విడుదలై నేటికి (ఏప్రిల్ 28) ఏడాది అవుతోంది. అయితే.. ఈ సినిమా ఇంతవరకు ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు రాలేదు. టీవీలో కూడా టెలికాస్ట్ కాలేదు. అందుకే ఈ సినిమా కోసం మూవీ లవర్స్, అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లంతా ఓటీటీలోనైనా చూద్దామనుకుంటే దాదాపు ఏడాది నుంచి ఎక్కడా అందుబాటులో లేదని కంప్లైంట్ చేస్తున్నారు.

PUSHPA 2: గెట్ రెడీ.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీదే హవా

అఖిల్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయారు. మొత్తంగా రూ.10 కోట్లలోపే వసూళ్లు సాధించింది. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాల్ని మిగిల్చింది. అఖిల్ కెరీర్‌కు బ్రేక్ వేసింది. ఏజెంట్ విడుదలై ఏడాదైనా.. అఖిల్ ఇంకో సినిమా అనౌన్స్ చేయలేదు. మంచి కమ్‌బ్యాక్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే.. సినిమా ఫలితం అనుకున్నట్లుగా లేకపోవడంతో ఏజెంట్‌ను త్వరగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. గత మే నెల మూడో వారంలోనే ఏజెంట్ స్ట్రీమింగ్‌కు రాబోతుందంటూ ప్రచారం జరిగింది. పైగా ఈ చిత్ర ఒరిజినల్ వెర్షన్.. అంటే అన్‌కట్ వెర్షన్ ఓటీటీలో వస్తుందని ప్రచారం జరిగింది. ఈ సినిమా హక్కుల్ని సోని లివ్ సంస్థ దక్కించుకుంది. దీంతో సోని లివ్‌లో ఏజెంట్ వస్తుందంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

ఏ కారణం వల్లో ఇంతవరకు సినిమా స్ట్రీమింగ్ కాలేదు. దీనిపై నిర్మాత అనిల్ సుంకర కూడా క్లారిటీ ఇచ్చాడు. తాము సోని లివ్ సంస్థకు ఏజెంట్ కాపీ ఇచ్చామని, సినిమా స్ట్రీమింగ్ వాళ్ల చేతుల్లోనే ఉందని తేల్చేశాడు. అయితే, సినిమా స్ట్రీమింగ్‌ గురించి పలు డేట్లు వినిపించినప్పటికీ.. సోని లివ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా లేదు. పోటీ టీవీలో టెలికాస్ట్ అయినా చూద్దామనుకుంటే.. ఏ టీవీలోనూ ఇప్పటివరకు సినిమా రాలేదు. చాలా సినిమాలు విడుదలైన నెల లోపే ఓటీటీల్లో, రెండు, మూడు నెలల్లో టీవీల్లో వచ్చేస్తుంటే.. ఏజెంట్ మాత్రం ఏడాదిగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా ఉండిపోయింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ, టీవీల్లోకి వస్తుందో చూడాలి. మరోవైపు.. ఈ సినిమాను ఇంకోసారి రీ రిలీజ్ చేయడమే బెటర్ అని ఇంకొందరు ఫ్యాన్స్ అంటున్నారు.