Dhoota Trailer : ధూతగా మారిన అక్కినేని కుర్రాడు.. ధూత ట్రైలర్ ఎలా ఉందంటే

ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2023 | 02:04 PMLast Updated on: Nov 23, 2023 | 2:04 PM

Akkineni Boy Who Became Doota How Is The Trailer Of Doota

ఓటీటీ కాలం నడుస్తోంది. ప్రేక్షకులను అలరించాలి ..చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు. ఆయన తొలిసారి దూత అనే వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రైలర్ విడుదల చేశారు.

Bigg Boss : జైలుకి వెళ్లిన వెళ్లిన శివాజీ.. బంపర్ ఛాన్స్ మిస్

ధూత ట్రైలర్ విషయానికి వస్తే.. నాగ చైతన్య ఒక క్లిష్టమైన నేరంలో చిక్కుకున్న జర్నలిస్ట్ సాగర్ పాత్రను పోషించాడు. ఈ వెబ్ సిరీస్ మొత్తం క్రైమ్ థ్రిల్లర్ గా కొనసాగనుంది. కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఓ పేపర్ కార్టూన్ లో ఉన్నదే నిజ జీవితంలో జరగడం, ఆ నేరాల్లో హీరో కూడా చిక్కుకుంటాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు అనేది కథాంశం అని తెలుస్తోంది. నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయింది.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఊహించని మలుపులతో సస్పెన్స్‌తో నిండిన సన్నివేశాలను సజావుగా మెరుగుపరుస్తూ, అద్భుతమైన ఆసక్తికరమైన అంశాల సమ్మేళనాన్ని ట్రైలర్లో చూపించారు. ఈ ధారావాహికలో ప్రతిభావంతులైన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ వంటివారు నటించారు. ప్రతి ఒక్కరూ కథనానికి సహాయపడే కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్‌పై శరత్ మరార్ దీనిని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఈ ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. ఈ క్రమంలో ఇది ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.