నీకుందిరా రేయ్‌ ! వేణుస్వామి కోసం వెతుకుతున్న అక్కినేని ఫ్యాన్స్‌

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 10, 2024 | 06:55 PMLast Updated on: Aug 10, 2024 | 6:55 PM

Akkineni Fans Fire On Venu Swamy

సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పేమస్‌ ఐన వేణుస్వామి మరోసారి రచ్చకు తెర లేపాడు. రీసెంట్‌గా నాగచైతన్య శోభిత దూళిపాళ ఎంగేజ్‌మెంట్‌ జరగడంతో.. వాళ్ల జీవితం ఎలా ఉండబోతోందో జాతకం చెప్పాడు. ఓ బోర్డ్‌ పెట్టుకుని పిల్లలకు ట్యూషన్‌ చెప్పినట్టు చాలా క్లియర్‌గా వాళ్లిద్దరి ఫ్యూచర్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేశాడు. ఓవరాల్‌గా వేణుస్వామి చెప్పింది ఏంటి అంటే.. మాగ్జిమం రెండేళ్లలో చైతన్యకు శోభితకు వివాదాలు.. గట్టిగా మాట్లాడితే విడాకులు తప్పవని. ఇద్దరి జాతకం ప్రకారం రెండేళ్ల తరువాత శోభితకు నాగ చైతన్యకు ఓ మహిళ కారణంగా గొడవలు జరుగుతాయట. అంతే కాదు.. జాతకం ప్రకారం శోభిత కంటే సమంతే బెటర్‌ అని చెప్పాడు వేణుస్వామి. బెటర్‌గా ఉన్న సమంతతోనే విడిపోయాడు అంటే అంతంత మాత్రంగా ఉన్న శోభితతో ఫ్యూచర్‌ ఏంటో ఆలోచించుకోవాలని ఓ ఫ్రీ అడ్వైజ్‌ కూడా ఇచ్చాడు. శుభమా అని ఎంగేజ్‌మెంట్‌ జరిగితే వేణుస్వామి చెప్పిన జాతకానికి అక్కినేని ఫ్యాన్స్‌కు చిర్రెత్తింది. ఇప్పటికే సమంత విషయంలో మంచి కాకమీద ఉన్న చైతన్య ఫ్యాన్స్‌.. వేణుస్వామిని వేసుకోవడం మొదలు పెట్టారు. నిజానికి సమంత నాగచైతన్య విడాకుల కారణంగానే వేణుస్వామి ఫేమస్‌ అయ్యాడు. ఆ తరువాత వరుసబెట్టి చాలా మంది జాతకాలు, పరిస్థితులు విశ్లేషణ చేశాడు. ఆ ఇన్సిడెంట్‌ తరువాత ఆయన చెప్పిన ఏ మ్యాటర్‌ పెద్దగా జరగలేదు. ప్రభాస్‌ విషయంలో వేరే హీరోల విషయంలో కూడా ఆయన ఏం చెప్పాడో దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా జరిగింది. అంతే.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గ్యాప్‌ లేకుండా ట్రోల్‌ చేసి ఓ ఆటాడుకున్నారు. దీంతో ఇక తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనంటూ ఆమధ్య వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోతో ఫ్యాన్స్‌ కాస్త కూల్‌ అయ్యారు. కానీ.. అలా చైతన్య ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడో లేదో ఇలా మరోసారి తన జాతకాల బోర్డ్‌ పట్టుకుని కెమెరా ముందుకు వచ్చేశాడు వేణుస్వామి. వీళ్లిద్దరూ కూడా విడిపోయే అవకాశం ఉంది అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపాడు. దీంతో మంటేత్తిపోయి ఉన్న అక్కినేని ఫ్యాన్స్‌ అంతా ఇప్పుడు వేణుస్వామిని ఏకిపారేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేలా ఉన్నారు. గతంలో ఓ ఇన్సిడెంట్‌ ఉన్నా.. ఇప్పుడు మరోసారి చైతన్య జాతకం చెప్పి లేని పెంటను కెలుక్కున్నాడు వేణుస్వామి. వద్దు అనుకుని పక్కన పెట్టిన సెలబ్రిటీల జాతకం ఎపిసోడ్‌ను మళ్లీ ప్రారంభించి అందరితో చీవాట్లు తింటున్నాడు.