నయనతార నరకం చూసింది, అతను నీచుడు, నాగార్జున సంచలన కామెంట్స్
పాన్ ఇండియా లెవెల్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరి ఫేమస్ అవుతోంది. ఇండియా వైడ్ గా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ డాక్యుమెంటరికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

పాన్ ఇండియా లెవెల్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరి ఫేమస్ అవుతోంది. ఇండియా వైడ్ గా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ డాక్యుమెంటరికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయింది. ధనుష్ వివాదంతో ఇది మరింత సంచలనం అయింది. రీసెంట్ గా ధనుష్… నయనతారకు నోటీసులు పంపడం, ఆ నోటీసులకు బహిరంగ లేఖ ద్వారా నయనతార రిప్లై ఇవ్వడం కాస్త సంచలనం అయింది. తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ఇద్దరి వైపునా ఉంది అనే విమర్శలు అయితే వస్తున్నాయి.
ఇక నయనతార డాక్యుమెంటరిలో కాస్త కీలక సన్నివేశాలు చూపించారు. ఆమెతో కలిసి పని చేసిన వారు… నయన్ గురించి నాలుగు మంచి మాటలు బయటపెట్టారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, ఇతర నటీ నటులు ఇలా కొందరు నయనతారతో తమకు ఉన్న అనుభవాలను, సెట్స్ లో ఆమె ఎలా ఉండేది అనే విషయాలను పంచుకున్నారు. ఇదే డాక్యుమెంటరిలో నాగార్జున ఓ సంచలన విషయం కూడా బయటపెట్టారు. నయనతారకు గతంలో రెండు మూడు ప్రేమ కథలు ఉండేవి. వాటి విషయంలో ఆమె బాగా ఇబ్బంది పడింది.
వాటి గురించి నాగార్జున మాట్లాడారు. ముందు ఆమె ప్రేమ కథలు నడిపినా… చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది. సెట్ లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని నాగార్జున ఓ సంచలనం విషయం చెప్పారు. ఫోన్ లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని అని తాను గమనించిన విషయాన్ని నాగార్జున చెప్పుకొచ్చారు. ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని తెలిపారు నాగార్జున. తన రిలేషన్ షిప్ లోనే సమస్య ఉందని అనిపించేదని అన్నారు.
ఇక దీనిపై నయనతార కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని చెప్పిన ఆమె… అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అలా తనను నమ్మించాడని సంచలన కామెంట్స్ చేసింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చినరీతిలో మాట్లాడుకున్నారని నయన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదని చెప్పింది నయనతార. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని ఎవరూ మగాళ్లను అడగరని అమ్మాయిలను మాత్రం అడుగుతారని తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. తప్పంతా అమ్మాయిలదే అన్నట్లుగా వార్తలు రాస్తారంటూ ఎమోషనల్ అయింది నయన్. అయితే అలా వేధించింది ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాని కొందరు మాత్రం ప్రభుదేవా అంటూ కామెంట్ చేస్తున్నారు.