Rajini- Naj : రజినీ కి విలన్ గా నాగార్జున
ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందున్నాడు నాగ్.

Akkineni Nagarjuna is in full swing. He is busy with back to back movies. If you like the content, you are ready for anything.
అక్కినేని నాగార్జున జోరుమీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుమ్మేస్తున్నాడు. కంటెంట్ నచ్చితే చాలు దేనికైనా రెడీ అనేస్తున్నాడు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సపోర్టింగ్ రోల్స్ లోమెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కుబేర మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నాగ్ ఓ మూవీ లో ఉహించని గెటప్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందున్నాడు నాగ్. బాలీవుడ్ కోలీవుడ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ మూవీలో నాగార్జున నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రజనీకాంత్ కు విలన్ గా నటించబోతున్నట్లు వార్తు వినిపిస్తున్నాయి. ఇటీవలే మొదలైన ఈ మూవీలో సినిమాకే హైలెట్ గా నిలిచే క్యారెక్టర్ కోసం నాగ్ ను అప్రోచ్ అయ్యారట. రజనీకి ధీటుగా ఉండే క్యారక్టర్ కావడంతో నాగార్జున ఓకే చెప్పారని, లోకేశ్ ఆయన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విక్రమ్ మూవీలో రొలెక్స్ కు ఎంత పేరు వచ్చిందో అంతకు మించి అనేలా క్యారెక్టర్ ను డిజైన్ చేయడంతో నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఎప్పుడెప్పుడో అంతం మూవీలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన కింగ్… ఇప్పుడు మరోసారి అలాంటి అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే