Akkineni Nagarjuna: పాక్‌లో నాగార్జున.. క్రేజ్ మామూలుగా లేదు..

నాగార్జునకు పాకిస్తాన్‌లో కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలేవీ పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. కానీ, అక్కడ నాగార్జునకు గుర్తింపు రావడానికి అచ్చం నాగార్జునలా ఉండే జైన్ అక్మల్ ఖాన్ అనే ఒక వ్యక్తి కారణం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 02:30 PMLast Updated on: Mar 12, 2024 | 2:38 PM

Akkineni Nagarjuna Like Food Vlogger In Pakistan Name Is Jain Akmal Kattar

Akkineni Nagarjuna: తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన నాగార్జున గురించి పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉంది. అయితే, నాగార్జునకు పాకిస్తాన్‌లో కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలేవీ పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. కానీ, అక్కడ నాగార్జునకు గుర్తింపు రావడానికి అచ్చం నాగార్జునలా ఉండే జైన్ అక్మల్ ఖాన్ అనే ఒక వ్యక్తి కారణం. ఆయన ఫుడ్ వ్లాగర్. జైన్ అక్మల్‌ను చూసిన పాక్‌లోని చాలా మంది అచ్చం నాగార్జునలాగే ఉన్నారంటున్నారు.

AP VOTES SHARING : ఓట్లు బదిలీ కాకపోతే.. కూటమి ఆశలు ఫట్టే !

మన సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వకున్నా.. హిందీలో డబ్ అవుతుంటాయి. హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాల్ని కూడా పాక్‌లో చూస్తారు. అలా.. నాగార్జునకు కూడా పాక్‌లో గుర్తింపు ఉంది. ఇక.. జైన్ అక్మల్ ఖాన్ తన టీనేజీ నుంచి స్టైల్‌గా, నాగ్‌లాగే ఉండేవారు. ముందుగా ఆయనకు నాగ్ గురించి తెలియదు. కానీ, చాలా మంది తనను ఇండియన్ హీరోలా ఉన్నావనే వాళ్లు. దీంతో ఆయన నాగ్ గురించి తెలుసుకున్నాడు. తను అలాగే ఉన్నట్లు గుర్తించి, అప్పట్నుంచి నాగార్జునను అనుకరించడం మొదలుపెట్టారు. నాగ్ డ్రెస్సింగ్ స్టైల్, లుక్, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్నింట్లోనూ నాగార్జునను ఫాలో అవుతున్నాడు. కొంతకాలం క్రితం జైన్ అక్మల్ సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ మొదలుపెట్టాడు.

అయితే, అతడు నాగార్జునలా ఉండటం, ఆయనలాగే మాట్లాడటంతో త్వరగానే పాపులారిటీ సాధించాడు. అతడి ఫుడ్ వ్లాగింగ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. నెలకు మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. మొత్తానికి నాగ్ క్రేజ్ పాకిస్తాన్‌కు కూడా చేరింది. ఇప్పుడు నాగార్జున పేరుతో జైన్ అక్మల్ కూడా మరింత ఫేమసయ్యాడు. ఏమైనా కింగ్ స్టైలే సెపరేట్ అంటున్నారు అక్కడి ఫ్యాన్స్.