AKKINENI NAGARJUNA: 300 మందితో నాగార్జున.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు
తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి నాగ్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

AKKINENI NAGARJUNA: అక్కినేని నాగార్జునకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. తెలుగు కళామతల్లి ఒడిలో ఎన్ని పాత్రలైతే ఉంటాయో.. అన్ని పాత్రల్లోను నటించి తనకి సాటి లేదని నాగ్ నిరూపించాడు. బహుశా ఇండియన్ సినిమా పుట్టిన దగ్గరనుంచి సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జున పోషించిన పాత్రలని ఇంకే నటుడు పోషించలేదని కూడా చెప్పాలి.
Salt Kasli Guru : కేజీ ఉప్పు రూ.53 వేలు.. దీని గొప్పదనం తెలిస్తే మతి పోద్ది..
తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి నాగ్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్యూర్ మాస్ సాంగ్‌గా తెరకెక్కుతున్న ఈ పాటలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కలిసి చిందులు వేస్తున్నారు. మూవీ మొత్తానికే హైలెట్‌గా నిలవనున్న ఈ సాంగ్ చిత్రీకరణలో సుమారు 300 మంది డ్యాన్సర్లు దాకా పాల్గొన్నారు. దినేష్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ తెరకెక్కుతుంది. కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందచేశారు. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న నా సామిరంగ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, సంభాషణలని అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా నా సామి రంగ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌తో ఈ మూవీ మీద నాగ్ అభిమానుల్లోను, సినీ ప్రేక్షకుల్లోను అంచనాలు పీక్‌లో ఉన్నాయి.