Kshaya Kumar-Kannappa : మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్.
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప (Kannappa). పాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా బాగా రావడం కోసం విష్ణు తో పాటు టీం మొత్తం చాలా కష్టపడుతుంది. క్వాలిటీ కోసం న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో కూడా షూటింగ్ చేసారు.

Akshay Kumar in Manchu Vishnu Kannappa.
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప (Kannappa). పాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా బాగా రావడం కోసం విష్ణు తో పాటు టీం మొత్తం చాలా కష్టపడుతుంది. క్వాలిటీ కోసం న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో కూడా షూటింగ్ చేసారు. నటీనటుల విషయంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న కన్నప్ప తాజాగా మరో నటుడి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు.
బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ (Superstar) అక్షయ్ కుమార్ (Akshay Kumar)కన్నప్ప లో నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలోనే హాట్ టాపిక్ అయ్యింది. ఆయన పోషించే క్యారక్టర్ కథలో చాలా కీలకమని పైగా అక్షయ్ లాంటి నటుడు అయితేనే న్యాయం చెయ్యగలడని యూనిట్ భావిస్తుంది. మరికొద్ది రోజుల్లో అక్షయ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.మంచు విష్ణు పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప తెరకెక్కుతుంది. 100 కోట్ల బడ్జట్ తో మోహన్ బాబు ,విష్ణు నిర్మిస్తున్నారు. ప్రీతీ ముకందన్ హీరోయిన్ గా చేస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ప్రభాస్, నయనతార లు శివుడు పార్వతి గా చెయ్యబోతున్నారనే టాక్ అయితే ఉంది. అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఆదివాసీ తెగ కి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే వీటిపై అధికార ప్రకటన మాత్రం లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం అన్ని భాషలకి చెందిన బడా స్టార్స్ కన్నప్ప లో నటించనున్నారు.