Akshay Kumar: కన్నప్ప కోసం బాలీవుడ్ స్టార్ హీరో..

మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, ఈ చిత్రంలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 09:17 PMLast Updated on: Apr 08, 2024 | 9:17 PM

Akshay Kumar Make His Tollywood Debut With Manchu Vishnu Starrer Kannappa

Akshay Kumar: మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా, విష్ణు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతీ దేవిగా కనిపిస్తారని తెలుస్తోంది.

Hyderabad Metro Rail: వెనక్కి తగ్గిన మెట్రో.. ఆఫర్లు కొనసాగిస్తూ నిర్ణయం..

అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తమిళ నటుడు శరత్ కుమార్, మధు, దేవరాజ్, ప్రీతి ముకుందన్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఈ చిత్రంలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనే ఖిలాడి.. అక్షయ్‌ కుమార్. అన్ని ఇండస్ట్రీస్ నుంచి నటుల్ని తీసుకుంటున్న చిత్ర బృందం.. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్‌ను ఒక కీలక పాత్రకు తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, ఖిలాడి ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలోనే కనిపించబోతున్నారట. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. త్వరలోనే అక్షయ్.. ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. మొత్తానికి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో కన్నప్ప పాన్ ఇండియా మూవీగా మారుతోంది.

దీంతో సినిమా స్థాయి కూడా పెరుగుతోంది. ఈ సినిమాకు ది బ్రేవెస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అనే ట్యాగ్ లైన్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పటికే థాయ్‌ల్యాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.