Akshay Kumar: ఢిల్లీ డేర్ డెవిల్స్ దేవుడు అక్షయ్ కుమార్
2009 సీజన్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. అందులో భాగంగా అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి నెలకొంది.
Akshay Kumar: మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ ఆటో బయోగ్రఫీ ‘పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్’ పుస్తకం అక్షయ్ కుమార్ గొప్పతనాన్ని తెలియజేసింది. ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత సంచలనమో అందరికీ తెలుసు. అయితే, లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల విలువ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. కానీ, నష్టాలను తట్టుకొని నిలబడటమూ అంత సులువేం కాదు. 2009 సీజన్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. అందులో భాగంగా అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి నెలకొంది.
అక్షయ్‌తో ప్రమోషనల్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరుకావడం వంటి బాధ్యతలతో కూడిన కాంట్రాక్ట్‌ను డీడీ చేసుకుంది. ఆర్థిక పరమైన చిక్కులు వెంటాడటంతో అనవసర ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అక్షయ్ కాంట్రాక్ట్‌ను ముగించాలని డీడీ భావించింది. అయితే, న్యాయపరంగా అదంతా సులువైన విషయం కాదు. భారీ మొత్తం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ కుమార్ మాత్రం తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని మాథుర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.