Nandamuri: బాలయ్య కాదు శివయ్య..అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!
తారకరత్న.. బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హార్ట్ ఎటాక్‌కు గురై తారకరత్న హాస్పిటల్‌లో ఉన్న సమయంలో అన్నీ తానై చూసుకున్నాడు బాలయ్య. ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ తారకరత్నను బతికించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ తారకరత్న చనిపోయాడు. అప్పటి నుంచి తారకరత్న కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు బాలయ్య.

alekhya reddy balakrishna
రీసెంట్‌గా తారకరత్న మీద ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. బసవతారకం హాస్పిటల్‌లో ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టాడు. హార్ట్ పేషెంట్స్‌కు ఈ బ్లాక్‌లో ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇస్తామని ప్రకటించాడు. హిందూపురంలో నిర్మిస్తున్న హాస్పిటల్‌లో కూడా హార్ట్ పేషెంట్స్‌కు ఉచిత వైద్యం అందిస్తామంటూ ప్రకటించాడు. బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు. బాలయ్యే తమకు దేవుడు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. శివుడి ఫొటోను బాలకృష్ణ ఫేస్‌తో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు.
బాలకృష్ణ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తారకరత్న హార్ట్ ఎటాక్‌తో పడిపోయినప్పుడే కాదు.. ముందు నుంచి తారకరత్న అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. బాలకృష్ణ ప్రోద్భలంతోనే తారకరత్న సినిమాల్లోకి వచ్చాడు. కెరియర్ పరంగా తీసుకునే ప్రతీ నిర్ణయంలో బాలకృష్ణ సలహా తీసుకునేవాడట తారకరత్న. ఆయన కాదన్న ఏపనీ చేసేవాడు కాదట. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అభిమానులకు వివరించారు అలేఖ్య రెడ్డి. ఈ పోస్ట్‌తో బాలయ్య అభిమానులు ఎమోషనల్ అయ్యారు. మా బాలయ్య బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram