డిప్యూటీ సీఎం తాలూకా అనిపించుకోవడం కోసమేనా ఇంత భజన..
“ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు గొప్ప అని” “మన ఇంటి కంటే చుట్టం ఇల్లు ఎప్పుడూ బాగుంటుందని” ఈ సామెతలు కమెడియన్, పొలిటీషియన్, యాక్టర్, యాంకర్ అలీకి బాగా సరిపోతాయి. సాధారణంగా సినిమా వాళ్ళు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్తే మాత్రమే రాజకీయాల జోలికి వెళ్ళాలి.
“ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు గొప్ప అని” “మన ఇంటి కంటే చుట్టం ఇల్లు ఎప్పుడూ బాగుంటుందని” ఈ సామెతలు కమెడియన్, పొలిటీషియన్, యాక్టర్, యాంకర్ అలీకి బాగా సరిపోతాయి. సాధారణంగా సినిమా వాళ్ళు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్తే మాత్రమే రాజకీయాల జోలికి వెళ్ళాలి. సినిమానే వ్రుత్తి, ప్రవృత్తి అనుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. రాజకీయ పార్టీలు ఇచ్చే పదవుల కోసమో, డబ్బుల కోసమో దేని కోసమో ఆశపడితే ఉన్నదీ పోతుంది ఉంచుకున్నది పోతుంది.
అలీ చేసింది అదే… ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన అలీ… పవన్ కళ్యాణ్ ను సైతం నానా మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఎన్నో సినిమాల్లో అలీకి మంచి పాత్రలు ఇచ్చారు. అలీ ఆర్ధికంగా నిలబడటానికి పవన్ కళ్యాణ్ సినిమాలు కచ్చితంగా కారణమే. ఆ విశ్వాసం అలీ చూపించాలి. చూపించకపోయినా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. కాని అలీ మాత్రం నోటి దూలతో ఎస్ నోటి దూలతో ఎవరో మెప్పు కోసం పవన్ కళ్యాణ్ ను విమర్శించారు.
కొన్ని విషయాల్లో వ్యక్తిత్వం అనేది ముఖ్యం. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లకు ఇది కాస్త ఎక్కువ అవసరం. ఉదాహరణకు… అశోక గజపతి రాజుని వైఎస్ జగన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు… విజయనగరం జిల్లాలో బలమైన నేతగా ఉన్న బొత్సా సత్యనారాయణను… అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేయమని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా ఆయన మాత్రం విమర్శలు చేయలేదు. కంటి తుడుపుగా ఏదో మాట్లాడినా ఆచితూచి మాట్లాడారు. కారణం… అశోక గజపతి రాజుని బొత్సా గురువుగా భావిస్తారు. ఆయన కాలేజిలోనే బొత్సా చదువుకున్నది.
రాజకీయాల్లో తల పండిన బొత్సా లాంటి నాయకుడే అలా ఉన్నప్పుడు… రాజకీయాలే జీవితం కాని అలీ… అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. ఆయనకు ఇచ్చిన పదవి కూడా పోయింది. అలీ మళ్ళీ సినిమాలే చేసుకోవాలి. అందుకే ఇప్పుడు నాలుకను కాస్త సినిమా వాళ్ళను పొగడటం వైపు తిప్పుతున్నారు. తాజాగా సరిపోదా శనివారం సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అలీ… పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మెడలో వేసుకునే ఎర్ర కండువాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు.
ఆ తర్వాత… దానయ్య నిర్మిస్తున్న “ఓజీ” సినిమా గురించి కూడా కామెంట్స్ చేసి… సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. దీని బట్టి చూస్తుంటే మళ్ళీ సినిమా అవకాశాల కోసం అలీ ప్రయత్నాలు చేస్తున్నారనేది అర్ధమవుతోంది. మెగా ఫ్యామిలీ అలీ మీద సీరియస్ గా ఉంది. ఎవరెన్ని మాట్లాడినా ఆ ఫ్యామిలీతో గోక్కుని సినిమా పరిశ్రమలో నిలబడటం అనేది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే మళ్ళీ కాళ్ళ బేరానికి వెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ను కలిసి అవసరమైతే క్షమాపణలు కూడా కోరడానికి అలీ సిద్దమవుతున్నారు అనే టాక్ వస్తోంది.