ఆంధ్రావాలా తప్ప అన్నీహిట్లే.. కాని 1+1 ఎప్పుడూ చరణ్ కి మైనెస్..
టాలీవుడ్ లో డ్యూయెల్ రోల్ ఎంతమందికి కలిసొచ్చింది...ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా చాలా మంది ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేశారు.

టాలీవుడ్ లో డ్యూయెల్ రోల్ ఎంతమందికి కలిసొచ్చింది…ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా చాలా మంది ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేశారు. ఆతర్వాత మెగా స్టార్ డబుల్, త్రిబుల్ ఫోటో కాన్సెప్ట్ తో కోట్లు వర్షం కురిపించాడు. ఐతే ఆతర్వాతే అంతసీన్ ఎవరికీ లేకుండా పోయింది. ఆతర్వాతీ తరంలో ఎన్టీఆర్ కి తప్ప ఈ ఫార్ములా మరెవరికీ కలిసి రాలేదు. అదుర్స్ నుంచి ఆంధ్రావాలా వరకు… జైలవకుశ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన దేవర వరకు డ్యూయెల్ రోలే కాదు, త్రిబుల్ రోల్స్ కూడా వేశాడు ఎన్టీఆర్. కట్ చేస్తే ఇప్పుడు తన లానే డ్యూయెల్ రోల్ తో దాడికి రెడీ అవుతున్నాడు చరణ్. కాకపోతే తనకి ఈ డబుల్ ఫోటో కాన్సెప్ట్ ఎన్నడూ పెద్దగా కలిసి రాలేదు. మొన్న గేమ్ ఛేంజర్ గేమ్ జామ్ అయ్యింది. అంతకుముందు నాయక్ పెద్దగా కిక్ ఇవ్వకుండా మిగిలిపోయింది. ఐనా జై లవకుశ, ముగ్గురు మొనగాళ్లు, మైఖేల్ మదన కామరాజు రూట్లో నడిచేందుకు పెద్ద సాహసమే చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
డ్యూయెల్ రోల్ వేస్తే అద్భుతాలు జరుగొచ్చు… అద్రుష్టం బాలేకపోతే అడ్రస్ గల్లంతవ్వొచ్చు… అందుకే కత్తిలాంటి కథ పడితే తప్ప డ్యూయెల్ రోల్ వేసేందుకు ఏ హీరో కూడా రిస్క్ చేసే అవకాశం లేదు. కాకపోతే జమానాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇలాంటి ఎన్నోప్రయోగాలు చేస్తే, తర్వాతీ తరంలో చిరంజీవి, కమల్ హాసన్ లో డబులు్, త్రిబుల్ రోల్స్ లో ప్రయోగాలు చేశారు
నాగ్ నుంచి బాలయ్య వరకు డ్యూయెల్ రోల్స్ ఆతరం హీరోలందరికీ కలిసొచ్చాయి. ఎటొచ్చి ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ కి తప్ప మరెవరికీ ఈ రోల్స్ కలిసొచ్చేలా లేవు. ఒక్క ఆంధ్రావాల ఎలాగోలా మిస్ ఫైర్ అయ్యింది కాని.. అది తప్పిస్తే తను డబుల్, త్రిబుల్ ఇలా ఎన్ని పాత్రల్లో కనిపించినా కనక వర్షమే కురిసింది. అదుర్స్ ట్రెండ్ సెట్టరైతే, జై లవకుశ లో ఏకంగా ముగ్గురి పాత్రల్లోకనిపించాడు. విలినిజం కూడా అప్పుడే చూపించాడు. రీసెంట్ గా దేవరలో డ్యూయెల్ రోల్ లో కనిపించి 670 కోట్ల పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నాడు తారక్.కట్ చేస్తే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, బన్నీతో పుష్ప రెండు భాగాలు తీసిన సుకుమారే ఈ ఆఫర్ ఇచ్చాడు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషనని ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు 2026 సంక్రాంతికి సుకుమార్ తోరామ్ చరణ్ సినిమా సెట్స్ పైకెళ్లేలా ఉంది.
ప్రస్తుతానికి ఉప్పెన ఫేం బుచ్చిబాబు మేకింగ్ లో పెద్ది మూవీ చేస్తున్న రామ్ చరణ్, ఆతర్వాత సుకుమార్ మేకింగ్ లో ప్రయోగం చేయబోతున్నాడు. అది కూడా డ్యూయెల్ రోల్ లోనే… కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, చరన్, ఎన్టీఆర్ లో డ్యూయెల్ రోల్ కేవలం మ్యాన్ ఆఫ్ మాసెస్ కే కలిసొచ్చింది. అదే రామ్ చరణ్ కి నాయక్ కొద్దివరకు పర్లేదనుకుంటే, గేమ్ ఛేంజర్ మాత్రం అస్సలు అడ్రస్సే గల్లంతయ్యేలా చేసింది.
తన తండ్రి చిరుకి ముగ్గురు మొనగాళ్లు లాంటి విచిత్ర హిట్లు ఉన్నాయి… కాని చరణ్ కే డ్యూయెల్ రోల్ అంటే చాలా డౌట్లు పెరుగుతున్నాయి. సుకుమార్ తో రీసెంట్ గా జరిగిన స్టోరీ డిస్కర్షన్ లో చరణ్ డ్యూయెల్ రోల్ అన్న మాట లీకైంది. అయితే సుకుమార్ ఎప్పుడు కథ చెప్పినా రెండు మూడు వర్షన్స్ లో కథ చెప్పడం కామన్. అలా చూస్తే తను డ్యూయెల్ రోల్ కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద వర్షన్ గా నే చెప్పాడని తెలుస్తోంది. ఉగాదికి ఏదైనా ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ మాత్రం ఉందని ప్రచారం జరుగుతోంది.