Kalki : ఇప్పటి దాకా 116 థియేటర్స్ ఇచ్చారు

ఇండియా మొత్తం ఎన్నికల హడావిడి అయిపోయింది. ఇక ప్రభాస్ కల్కి2898 ad (Kalki2898 ad) హడావిడి స్టార్ట్ అయ్యింది. జూన్ 27 కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ ప్రభాస్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉండబోతోందనే ఉత్సుకత మొదలయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2024 | 10:32 AMLast Updated on: Jun 08, 2024 | 10:32 AM

All India Is In The Election Rush And Prabhas Kalki 2898 Ad Rush Has Started

 

 

ఇండియా మొత్తం ఎన్నికల హడావిడి అయిపోయింది. ఇక ప్రభాస్ కల్కి2898 ad (Kalki2898 ad) హడావిడి స్టార్ట్ అయ్యింది. జూన్ 27 కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ ప్రభాస్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉండబోతోందనే ఉత్సుకత మొదలయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో (Social media) కల్కి కి సంబంధించిన అప్ డేట్ కోసం చూస్తు ఉన్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది.

ఇండియాలో కల్కి ఇరవై ఏడు న రిలీజ్ అవుతుంటే ఒక రోజు ముందుగానే ఓవర్ సీస్ లో రిలీజ్ అవుతుంది. అంటే జూన్ 26 నే ఓవర్ సీస్ లో బొమ్మ పడనుంది.ఈ మేరకు అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసారు. టికెట్స్ హాట్ కేక్ ల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకు 116 థియేటర్స్ లో బుకింగ్ ఓపెన్ చెయ్యగా ఒక్క రోజులోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి కల్కి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని థియేటర్స్ ని పెంచబోతున్నారు. మొత్తం 124 లొకేషన్స్ లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఈ నెల పది న ట్రైలర్ విడుదల కాబోతున్న విషయం అందరకి తెలిసిందే. ప్రభాస్ సరసన దీపికా పదుకునే (Deepika Padakune) జత కడుతుండగా అమితాబ్ (Amitabh), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి గ్రేట్ నటులు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. దిశాపటాని ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇండియన్ చిత్ర సీమలో మునుపెన్నడూ లేని విధంగా 600 కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న కల్కి పై ప్రతి ఒక్క భారతీయుడి పై భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) పై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల కల్కి కి సంబంధించిన లీక్ లు కూడా రావడంతో అశ్వనీ దత్ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎవరైనా లీక్ లకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాడు.