12గం; ల్లో పాన్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్, దీనెమ్మ పుష్ప 2 ఓపెనింగ్స్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్

పుష్ప ది రూల్... అఫీషియల్ ప్రెస్ మీట్ లో, పుష్ప కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓ మాట చెప్పాడు... కచ్చితంగా కేజిఎఫ్, కాంతారా రికార్డ్స బ్రేక్ చేసేలా కర్ణాటకలో పుష్ప 2 మూవీని రిలీజ్ చేస్తామని... ఎస్ చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నంత పని చేసాడు పుష్ప.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2024 | 08:45 PMLast Updated on: Dec 02, 2024 | 8:45 PM

All Pan India Records Broken In 12 Hours

పుష్ప ది రూల్… అఫీషియల్ ప్రెస్ మీట్ లో, పుష్ప కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓ మాట చెప్పాడు… కచ్చితంగా కేజిఎఫ్, కాంతారా రికార్డ్స బ్రేక్ చేసేలా కర్ణాటకలో పుష్ప 2 మూవీని రిలీజ్ చేస్తామని… ఎస్ చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నంత పని చేసాడు పుష్ప. ప్రీ బుకింగ్ మార్కెట్ లెక్కలు చూస్తే… కన్నడ మూవీ మార్కెట్ నే కాదు ఇండియా లెవెల్ లో షేక్ చేసింది పుష్ప. డిసెంబర్ 1 అర్ధరాత్రి నుంచి సినిమా ప్రీ బుకింగ్ స్టార్ట్ అయితే ఓ రేంజ్ లో పాన్ ఇండియా మూవీ మార్కెట్ ను ఊపుతుంది పుష్ప బజ్. పుష్ప 2 ను తక్కువ అంచనా వేసిన వాళ్లకు ఇచ్చిపడేసాడు ఐకాన్ స్టార్.

పఠాన్, గదర్ 2, KGF చాప్టర్ 2 వంటి ఆల్-టైమ్ బ్లాక్‌ బస్టర్‌లు సెట్ చేసిన రికార్డ్ లను కూడా అధిగమించి, సినిమా ప్రీ-సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ప్రీ బుకింగ్‌ ప్రారంభమైన మొదటి 12 గంటలలో, పుష్ప 2 మొదటి రోజు 3 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో ఇండియాలో రిలీజ్ కు ముందే ఈ మూవీ రూ 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గత ఏడాది జనవరిలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ 2 లక్షల టిక్కెట్లు విక్రయించగా… అంతకంటే స్పీడ్ గా పుష్ప ప్రీ బుకింగ్స్ జరిగాయి.

ఇప్పటి వరకు పఠాన్ సినిమా బుకింగ్స్ హైలెట్ గా నిలిచాయి. కాని పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 డామినేషన్ చూసి… బాలీవుడ్ స్టార్ హీరోలకు మైండ్ బ్లాక్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 కన్నడ బ్లాక్‌బస్టర్, KGF చాప్టర్ 2ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. 2022లో వచ్చిన కేజిఎఫ్ హిందీ-డబ్బింగ్ వెర్షన్‌కి మొదటి 12 గంటల్లో 1.25 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. డిసెంబర్ 1 మధ్యాహ్నం నాటికి హిందీలో 1.8 లక్షల టిక్కెట్లు బుక్ కావడంతో పుష్ప ఆ రికార్డ్ ను 12 గంటల్లోనే బ్రేక్ చేసింది.

తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్‌ లో పుష్ప 2 హిందీలో రూ 5.5 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 3 కోట్లు వసూలు చేసింది. నాలుగు రోజుల సమయం ఉన్నందున, ఈ లెక్కలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పఠాన్, జవాన్ వంటి సినిమాలకు వరల్డ్ వైడ్ గా మిలియన్ టికెట్స బుక్ అయ్యాయి. పుష్ప స్పీడ్ చూస్తే ఆ రికార్డులు అన్నీ బ్రేక్ కావడం పక్కా అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రీ బుకింగ్ కలెక్షన్స్ 58.73 కోట్లను ఈజీగా బ్రేక్ చేస్తుంది పుష్ప.